ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Assembly: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే Vs మంత్రులు

ABN, Publish Date - Dec 16 , 2023 | 02:42 PM

Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి వర్సెస్ మంత్రులు అన్న విధంగా సాగాయి. కాంగ్రెస్ అలవిగాని హామీలను ఇచ్చిందని.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే బీజేపీ ఊరుకోదని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly) బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి (BJP MLA Maheshwar reddy) వర్సెస్ మంత్రులు అన్న విధంగా సాగాయి. కాంగ్రెస్ అలవిగాని హామీలను ఇచ్చిందని.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే బీజేపీ ఊరుకోదని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

శనివారం అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు విరుచుకుపడగా.. కాంగ్రెస్ మంత్రులు కూడా తగ్గేదే లే అన్నట్లుగా సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... 412 హామీల గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. రోజూ ప్రజా దర్బార్ అన్నారని... రెండు రోజులకే పరిమితం చేశారని అన్నారు. ప్రగతి భవన్‌ను స్టడీ సెంటర్ చేస్తామన్నారని.. ఇప్పుడు దానిని ప్రజా దర్బర్ చేశారని.. మరో భవనాన్ని భట్టికి అధికారిక నివాసం చేశారన్నారు. అప్పులు చూపించి హామీలను నెరవేర్చకుండా తప్పించుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ప్రజల హామీలను నెరవేర్చకపోతే బీజేపీ ఊరుకోలేదని హెచ్చరించారు. కాంగ్రెస్ అలవి గాని హామీలను ఇచ్చిందన్నారు. ఎన్ని హామీలను ఇచ్చినా బొటాబొటి మెజారిటీ ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డి అదృష్టవంతుడని... ఓ చోట ఓడిపోయినా ముఖ్యమంత్రి అయ్యారన్నారు. రేవంత్ రెడ్డికి పాలనా అనుభవం లేకపోయినా అనుభవజ్ఞులైన మంత్రుల సూచనలు తీసుకుని పాలన సాగిస్తారన్నారు. దూకుడు తగ్గించుకుని పాలన సాగించాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు సహకారం అందిస్తామని.... హామీలను విస్మరిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోనిది లేదన్నారు.

హామీలను నెరవేర్చేందుకు ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి కనీసం వందరోజుల సమయం ఇవ్వాలని అనుకుంటున్నామన్నారరు. ఉచితాలు రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేస్తాయని తెలిపారు. అధికారంలోకి రావాలన్న ఆకాంక్షతోనే అనేక హామీలను ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం బీజేపీ లేకపోతే సాధ్యం కాదన్నారు. అందుకు కృషి చేసిన సుష్మా స్వరాజ్‌ను విస్మరించడం బాధాకరమన్నారు. మెడికల్ కాలేజీలకు ఆర్థిక సాయం అప్పు రూపంలో తీసుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చిందో వివరాలు పొందుపరిస్తే బాగుండేదని అన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కోసం ప్రయత్నం చేస్తామని అన్నారు. జాతీయ హోదా ఇవ్వకపోతే ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకు పోరా అని మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.


డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉద్యోగాలు, ఇల్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని హామీ ఇచ్చామని.. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తాము ప్రయత్నం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పేదలకు ఆర్ధిక సాయం చేసేలా ప్రయత్నం చేయాలన్నారు. జాతీయ హోదా ఇచ్చేందుకు నార్మ్స్ ఎంటో అందరికి తెలుస్తాయన్నారు. ఈ అంశాన్ని తమపై నెట్టి చేతులు దులుపుకోవాలని చూడటం సరైంది కాదన్నారు.

మంత్రి పొన్నం మాట్లాడుతూ.. మోదీ తెలంగాణ సమాజాన్ని అవమాన పరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. బీజేపీ నేతలకు సిగ్గుపడాలన్నారు. బీజేపీ అనేక రకాలుగా అవమాన పరచిన పార్టీ అని తెలిపారు. బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ కలిసి 54 మంది ఉన్నామని మాట్లాడుతున్నారన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కో‌సం పాలమూరుకు జాతీయ హోదా ఇప్పించాలన్నారు. తామంతా కలిసి బీజేపీ వెంట వస్తామన్నారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి జాతీయ హోదా కోసం అంతా కలిసి పనిచేస్తాం అనడాన్ని స్వాగతిస్తామన్నారరు. ఇందుకోసం ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపుదామని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 16 , 2023 | 02:42 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising