ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Koppula Eshwar: ‘కేసీఆర్‌ కుటుంబాన్ని బద్నాం చేయడానికే కవితకు నోటీసులు’

ABN, First Publish Date - 2023-03-11T14:29:45+05:30

తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందని అందులో భాగంగానే మా నేతలపై దాడులు జరిగాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: తెలంగాణ (Telangana)పై కేంద్రం (Central Government) కక్ష కట్టిందని అందులో భాగంగానే మా నేతలపై దాడులు జరిగాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ (KCR) కుటుంబాన్ని బద్నాం చేయడానికి కవిత (BRS MLC Kavitha)కు నోటీస్‌లు పంపారని మండిపడ్డారు. బీజేపీ (BJP)ది దుర్మార్గపు పద్ధతి అని అన్నారు. తప్పు చేయనప్పుడు భయ పడాల్సిన అవసరం లేదన్నారు. అధికార దాహంతో తెలంగాణ ప్రభుత్వాన్ని (Telangana Government) ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ మాటలకు అర్ధం లేదన్నారు. దేశంలో అనేక మంది సీఎంలు, మంత్రుల మీద ఇలాంటి దాడులే చేశారని... లొంగిపోతే వైఖరి మార్చుకున్నారంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శలు గుప్పించారు.

రెండు గంటలుగా...

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ (Delhi Liqour Scam) కు సంబంధించి రెండు గంటలుగా కవిత ఈడీ (ED) విచారణ కొనసాగుతోంది. కవితను ముగ్గురు అధికారుల బృందం ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండోస్పిరిట్స్ కంపెనీలో వాటాలు, 100 కోట్ల ముడుపుల వ్యవహారంపై కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలు సాక్ష్యాలతో కవితను ప్రశ్నిస్తోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా కవిత స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేస్తున్నారు. అరుణ్ పిళ్ళై (Arun Pillai), బుచ్చిబాబు (Buchibabu), అభిషేక్(Abhishek), శరత్ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy), మాగుంట రాఘవ (Magunta Raghava), సమీర్ మహేంద్రు (Sameer Mahendru), అమిత్ అరోరా (Amit Arora) ఇచ్చిన సమాచారంతో కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2023-03-11T14:29:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising