Rahul singh case: జిమ్ ట్రైనర్ రాహుల్‌సింగ్ కేసులో వీడిన మిస్టరీ ... వెలుగులోకి సంచలన నిజాలు.. సుఫారీ గ్యాంగ్‌తో మరీ ఇంత దారుణంగా ...
ABN, First Publish Date - 2023-09-02T17:42:21+05:30
నగరంలో సంచలనం కలిగించిన జిమ్ ట్రైనర్ రాహుల్‌సింగ్ హత్య కేసును(Gym trainer Rahul Singh case) రాజేంద్రనగర్ పోలీసులు చేధించారు.
హైదరాబాద్: నగరంలో సంచలనం కలిగించిన జిమ్ ట్రైనర్ రాహుల్‌సింగ్ హత్య కేసును(Gym trainer Rahul Singh case) రాజేంద్రనగర్ పోలీసులు చేధించారు. ఈ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. సుఫారీ గ్యాంగ్‌తో అతి దారుణంగా రాహుల్‌ని హతమార్చారు. ఈ కేసు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.ఈ కేసులో చిక్కుముడులను చూసి పోలీసులు విస్తుపోయారు. రాహుల్‌సింగ్ హత్య కేసుకు సంబంధించిన విషయాలను శనివారం నాడు రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి (Rajendranagar DCP Jagadeeswar Reddy)మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు.‘‘రాహుల్‌సింగ్ ను హత్య చేసింది టోలిచౌకి సుఫారీ గ్యాంగ్(Tolichowki Sufari Gang). ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఆరుగురు సుఫారీ గ్యాంగ్ మరో ఇద్దరూ సుఫారీ ఇచ్చినవారు ఉన్నారు. ఆస్తి తగాదాల కారణంగా రాహుల్ హత్య జరిగింది. రాహుల్ సమీప బంధువులే సుపారి ఇచ్చి హత్య చేయించారు.మణికొండ, పుప్పాలగూడలో 35 ఎకరాల విషయంలో రాహుల్‌సింగ్ , రాజాసింగ్, వినోద్‌సింగ్ మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ భూవివాదం ( Land Dispute) తాతల కాలం నాటి నుంచి ఉంది.భూ వివాదం నేపథ్యంలోనే రాహుల్‌సింగ్‌ను చంపాలని పక్కా పథకం రచించారు.
రాహుల్‌సింగ్‌ని అంతమొందించేందుకు టోలిచౌకికి చెందిన సుఫారీ గ్యాంగ్‌ని రాజాసింగ్, వినోద్‌సింగ్ ఆశ్రయించారు. నిందితుల వద్ద నుంచి ఒకటిన్నర లక్షల నగదు, రెండు బైక్స్, ఎనిమిది మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాం. సుఫారీ ఇచ్చిన రాజాసింగ్, వినోద్‌సింగ్‌తో పాటు సుపారి గ్యాంగ్‌లోని సభ్యులను కూడా కస్టడిలోకి తీసుకొని విచారిస్తాం.రాహుల్ భూ వివాదాలపై గతంలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కేసు కోర్టులో నడుస్తోంది. భూ వివాదాల కారణంగానే రాహుల్‌సింగ్ కుటుంబంపై రాజాసింగ్ వినోద్‌సింగ్ పగ పెంచుకున్నారు. రాహుల్ నివాసం వద్ద, సెలబ్రిటీ జిమ్ వద్ద నిందితులు రెక్కీ నిర్వహించారు. 15 లక్షలకు రాహుల్‌సింగ్‌ను చంపడానికి సుపారి గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.సుపారి గ్యాంగ్ కీలక సభ్యుడు అక్బర్ పది లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. రాహుల్‌సింగ్ హత్య కేసులో నిందితులైన సుఫారీ గ్యాంగ్ సభ్యులు మహ్మద్ అక్బర్, సయ్యద్ షాబాద్, సయ్యద్ ఇర్ఫాన్, సయ్యద్ సుల్తాన్, మహ్మద్ మజీద్‌తో పాటు మహ్మద్ ఆఫ్సర్ పాషాలను అరెస్ట్ చేశాం’’ అని రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి మీడియాకు తెలిపారు.
Updated Date - 2023-09-02T17:44:18+05:30 IST