ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TPCC Chief: ఇది ప్రభుత్వం, కేసీఆర్ చేసిన హత్యే.. హోంగార్డ్ రవీందర్ మృతిపై రేవంత్

ABN, First Publish Date - 2023-09-08T13:47:40+05:30

రాష్ట్ర డీజీపీని కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఉదయం కలిశారు. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... డీజీపీని కలిసి రెండు అంశాలను చర్చించామని తెలిపారు. హోంగార్డు రవీందర్ జీతాలు రాక ఆత్మహత్యపై డీజీపీ దృష్టికి తెచ్చామని అన్నారు.

హైదరాబాద్: రాష్ట్ర డీజీపీని కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఉదయం కలిశారు. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth reddy) మాట్లాడుతూ... డీజీపీని కలిసి రెండు అంశాలను చర్చించామని తెలిపారు. హోంగార్డు రవీందర్ జీతాలు రాక ఆత్మహత్యపై డీజీపీ దృష్టికి తెచ్చామని అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ (CM KCR) చేసిన హత్య అని ఆరోపించారు. కేసీఆర్‌పై హత్యా నేరం కింద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. హోంగార్డులకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిందని తెలిపారు. రాష్ట్రం దివాళా తీయడానికి కారణం కేసీఆర్ అవినీతి అని విరుచుకుపడ్డారు. కాంట్రాక్టర్లు, కమీషన్లు ఇచ్చే వారికే బిల్లులు ఇస్తున్నారన్నారు. రవీందర్ పిల్లల చదువుల ఖర్చు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డీజీపీని కోరామని టీపీసీసీ చీఫ్ తెలిపారు.


కనీవినీ ఎరుగని విధంగా విజయభేరీ సభ...

16, 17న తాజ్ కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయన్నారు. 17న విజయ భేరి బహిరంగ సభను నిర్వహిస్తున్నామని... ఇందుకు సంబంధించి భద్రతను అందించాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. పరేడ్ గ్రౌండ్ ఇవ్వకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్ర చేశాయని మండిపడ్డారు. విజయభేరి బహిరంగ సభకు భద్రత కల్పించాలని కోరామన్నారు. కేసీఆర్ రాజకీయ విజ్ఞతతో వ్యవహరించాలని హితవుపలికారు. ప్రభుత్వం నుంచి ఆటంకాలు కలగకుండా చూడాలన్నారు. విజయభేరీ సభకు ఆటంకం కలిగించడం సరైంది కాదన్నారు. కేసీఆర్ చిల్లర ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తుక్కుగూడాలో సభ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించామని చెప్పారు. కనీవినీ ఎరుగని విధంగా విజయభేరి సభను నిర్వహించి తీరతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-08T13:47:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising