Revanth Reddy: ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి క్లారిటీ.. ఇప్పటికైనా వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్టేనా?...
ABN, First Publish Date - 2023-07-13T16:36:08+05:30
ఉచిత విద్యుత్‌పై రాష్ట్రంలో తీవ్ర రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన రేవంత్ కాసేపటి క్రితమే మీడియా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్: ఉచిత విద్యుత్‌పై రాష్ట్రంలో తీవ్ర రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు తన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) క్లారిటీ ఇచ్చారు. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన రేవంత్ కాసేపటి క్రితమే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. ఊర్లో పెళ్లికి కుక్కల సందడిలాగా పుట్టలో పడుకున్న పాములు బయటకి వచ్చి తనను నిందిస్తున్నారని మండిపడ్డారు. అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కొందరు నిపుణులు తెలంగాణ ప్రభుత్వ పాలసీలపై ప్రశ్నలు సంధించారని... కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు తాను క్లియర్‌గా వివరించినట్లు చెప్పారు. తాను చెప్పిన సమాధానంలో కొంత భాగాన్ని కట్ చేసి ప్రచారం చేశారని ఆరోపించారు. ఐటీ మంత్రి అతి తెలివి ప్రదర్శించి చిల్లర వ్యవహారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్‌పై మరోసారి చర్చ జరగడం మంచిదే అని అన్నారు. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ అంశాన్ని కాంగ్రెస్ ప్రకటించిందని.. ఉచిత కరెంట్ ఇవ్వడం కుదరదని తెలుగుదేశంతో చెప్పించిన వ్యక్తి చంద్రశేఖర్ రావు అని చెప్పుకొచ్చారు. నాడు విద్యుత్ ఉద్యమంలో రైతులను చంపిన పాపం ముమ్మాటికీ కేసీఆర్ దే అంటూ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వస్తే వ్యవసాయంలో ఇద్దరం పోటీ పడదామన్నారు. ‘‘నేను వ్యవసాయం తెలిసిన వాడిని. దుక్కి దున్నిన వాడిని. కేటీఆర్ లాగా అమెరికాలో బాత్‌రూంలు కడగలేదు. నేను పాస్ పోర్ట్ బ్రోకర్ కొడుకుని కాదు. నేను దళారీ కొడుకును కాదు’’ అంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Updated Date - 2023-07-13T16:43:46+05:30 IST