Telangana Governor: తెలంగాణ సర్కార్‌పై మెత్తబడ్డ గవర్నర్.. పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని వెల్లడి
ABN, First Publish Date - 2023-07-10T14:44:40+05:30
తెలంగాణ సర్కార్‌పై గవర్నర్ తమిళిసై మెత్తబడ్డారు. రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం తగ్గినట్టుగా తాజాగా ఒక పరిణామం స్పష్టం చేసింది. పెండింగ్ బిల్లులను జూలై 15లోగా క్లియర్ చేస్తామని తెలంగాణ రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. మున్సిపల్, ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులు గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్: తెలంగాణ సర్కార్‌పై (Telangana Government) గవర్నర్ తమిళిసై మెత్తబడ్డారు. రాజ్‌భవన్ (Rajbhavan), ప్రగతిభవన్ (PragatiBhavan) మధ్య దూరం తగ్గినట్టుగా తాజాగా ఒక పరిణామం స్పష్టం చేసింది. పెండింగ్ బిల్లులను జూలై 15లోగా క్లియర్ చేస్తామని తెలంగాణ రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. మున్సిపల్, ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లులు గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో పెట్టడంతో బీఆర్‌ఎస్ (BRS)నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
గవర్నర్ తమిళిసై (Governor Tamilisai Soundararajan) తీరుపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు (Supreme Court) కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య ఆ సమయంలో పెరిగిన దూరం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే.. తాజాగా గవర్నర్ పెండింగ్ బిల్లులను జూలై 15లోగా క్లియర్ చేస్తామని స్పష్టం చేయడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
గవర్నర్ ఆమోదించిన బిల్లులు
1) ది తెలంగాణ మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ (సవరణ) బిల్లు-2022
2) ది తెలంగాణ మునిసిపాలిటీస్ (సవరణ) బిల్లు-2023
3) ది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (సవరణ) బిల్లు-2023
పెండింగ్‌లో ఉన్నవి..
1) ది తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) (సవరణ) బిల్లు-2022
2) ది తెలంగాణ మునిసిపల్ లాస్ (సవరణ) బిల్లు-2022
Updated Date - 2023-07-10T14:44:54+05:30 IST