ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS IPS: రఘునందన్ వ్యాఖ్యలను ఖండించిన టీఎస్ ఐపీఎస్ అసోసియేషన్

ABN, First Publish Date - 2023-04-05T14:53:48+05:30

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్పై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ (BJP MLA Raghunandan)పై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం (Telangana IPS Officers Association) ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ డీజీపీ (Telangana DGP)పై రఘునందన్‌ చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఎమ్మెల్యే రఘునందన్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కు తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. డీజీపీపై దారుణ పదజాలం ఉపయోగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ రాజ్యాంగాన్ని డీజీపీ అమలు చేస్తున్నారని రఘునందన్ అన్నారు. రఘునందన్వి బాధ్యతారహితమైన వ్యాఖ్యలని అధికారుల సంఘం తెలిపింది. పోలీసు వ్యవస్థ నైతికతను దెబ్బతీస్తున్నాయని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా.. బండి సంజయ్‌ను పరామర్శించేందుకు ఈరోజు ఉదయం బొమ్మలరామారం పోలీస్‌‌స్టేషన్‌కు వచ్చిన రఘునందన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణం చెప్పాలని రఘునందన్ ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు, రఘునందన్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అరెస్ట్ ప్రొసీజర్ ఇదేనా? అంటూ బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. బండి సంజయ్ అరెస్ట్ విషయంలో డీసీపీని కలిసేందుకు వస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడాక తాను పూర్తిగా పోలీసులకు సహకరిస్తానంటూ చెబుతున్నప్పటికీ వినకుండా బలవంతంగా రఘునందన్‌ను పోలీస్ వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. తన వద్ద తుపాకీ ఉందని... మీ చేష్టల వల్ల మిస్ ఫైర్ అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నా వినకుండా రఘునందన్‌ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. అటు మహిళా మోర్చా నేతలపైనా పోలీసులు దురుసుగా వ్యవహరించారు. మహిళలని చూడకుండా ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తారా? అంటూ మహిళా మోర్చా రాష్ట్ అధ్యక్షురాలు గీతామూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్... పోలీస్ జులుం నశించాలంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

Updated Date - 2023-04-05T14:53:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising