Uppal PS: చర్చనీయాంశంగా ఉప్పల్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ పోస్టింగ్ వివాదం
ABN, First Publish Date - 2023-10-08T22:02:13+05:30
ఉప్పల్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ పోస్టింగ్( Uppal Police Inspector Posting) వివాదం చర్చనీయాంశంగా మారుతోంది. ఇక్కడ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఇన్స్‌పెక్టర్ గోవింద్‌రెడ్డి(Govind Reddy)ని ఉన్నత స్థాయి అధికారులు ఆకస్మికంగా బదిలీ చేశారు.
హైదరాబాద్: ఉప్పల్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ పోస్టింగ్(
Uppal Police Inspector Posting) వివాదం చర్చనీయాంశంగా మారుతోంది. ఇక్కడ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ఇన్స్‌పెక్టర్ గోవింద్‌రెడ్డి(Govind Reddy)ని ఉన్నత స్థాయి అధికారులు ఆకస్మికంగా బదిలీ చేశారు. గోవింద్‌రెడ్డిని ఉప్పల్ నుంచి సీసీఎస్‌కు ఉన్నతస్థాయి అధికారులు బదిలీ చేశారు. ఆయన స్థానంలో 2009 బ్యాచ్ అధికారి బి. శ్రావణకుమార్(Shravan Kumar) ను ఇన్స్‌పెక్టర్‌గా నియమించారు. ఇన్స్‌పెక్టర్ బి.శ్రావణకుమార్‌పై లంచం డిమాండ్‌పై ఏసీబీ అధికారులు(ACB officials) 41/A కేసు నమోదు చేసి నోటీసులిచ్చారు. జూలై 17వ తేదీన ఈకేసు నమోదు అయింది. ఓ షూటర్ తన గన్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకునేందుకు వచ్చినప్పుడు ఇన్స్‌పెక్టర్ బి.శ్రావణకుమార్ 30 వేలు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఇన్స్‌పెక్టర్ బి.శ్రావణకుమార్ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసును ఎదుర్కొంటున్న సమయంలోనే బి. శ్రావణకుమార్‌ను మరలా తిరిగి కీలకమైన ఉప్పల్ పీఎస్‌కు ఇన్స్‌పెక్టర్‌గా పోస్టింగ్ ఇవ్వడం పోలీస్ వర్గాల్లో కలవరం సృష్టిస్తోంది.
Updated Date - 2023-10-08T22:02:13+05:30 IST