ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

V Hanumantha Rao : సోనియా గాంధీ చరిత్ర అమిత్ షాకు తెలుసా?

ABN, First Publish Date - 2023-07-29T13:36:05+05:30

ప్రతిపక్ష పార్టీల INDIA కూటమిపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. ప్రధాని పదవి త్యాగం చేసిన నాయకురాలు సోనియా గాంధీ అని కొనియాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని సోనియా అనుకుంటే ఆ రోజు చేసి ఉండేవారన్నారు.

హైదరాబాద్ : ప్రతిపక్ష పార్టీల INDIA కూటమిపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. ప్రధాని పదవి త్యాగం చేసిన నాయకురాలు సోనియా గాంధీ అని కొనియాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని సోనియా అనుకుంటే ఆ రోజు చేసి ఉండేవారన్నారు. సోనియా గాంధీ దేశం కోసం పని చేస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేసేలా ప్రధాని మోదీ నిర్ణయాలు ఉన్నాయని వీహెచ్ పేర్కొన్నారు.

మణిపూర్ ఘటన పై ప్రధాని ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులు మణిపూర్ వెళుతుంటే .. ఇప్పుడు అమిత్ షా మాట్లాడుతున్నారన్నారు. మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని వీహెచ్ విమర్శించారు. రాష్ట్రానికి వచ్చినప్పుడు కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడే బీజేపీ నేతలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇప్పుడు దేశంలో ప్రజలు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుతున్నారన్నారు. త్వరలోనే కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తోందన్నారు. బీసీ జనగణన చేస్తామని.. రిజర్వేషన్ పెంపుపుపై నిర్ణయం తీసుకుంటామని వీహెచ్ తెలిపారు.

Updated Date - 2023-07-29T13:36:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising