Congress YSRTP: కాంగ్రెస్‌కు షర్మిల పెట్టిన డెడ్‌లైన్ ముగిసింది.. చివరికి ఏం తేలిందంటే..!
ABN, First Publish Date - 2023-09-30T16:21:15+05:30
వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila).. కాంగ్రెస్‌కు (Congress) పెట్టిన గడువు నేటితో ముగిసింది. పార్టీ విలీనంపై ఇప్పటికే ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్‌తో చర్చలు జరిపారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో షర్మిల ఏం చర్చలు జరిపారో
వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila).. కాంగ్రెస్‌కు (Congress) పెట్టిన గడువు నేటితో ముగిసింది. పార్టీ విలీనంపై ఇప్పటికే ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్‌తో చర్చలు జరిపారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో షర్మిల ఏం చర్చలు జరిపారో బయటకు రాలేదు. కానీ సెప్టెంబర్-30 చివరి రోజు అంటూ షర్మిల డెడ్ లైన్ విధించారు. అయితే విలీనం.. లేదంటే ఒంటరిగా పోటీ చేస్తామని షర్మిల ఇప్పటికే ప్రకటించారు. నేటితో ఆ గడువు ముగియనుండటంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు రంగంలోకి దిగినట్లు చర్చ నడుస్తోంది. షర్మిలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చర్చలు దాదాపు సక్సెస్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో.. కాంగ్రెస్‌లో వైఎస్సాఆర్‌టీపీ విలీన ప్రక్రియ తుది దిశకు చేరనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీకి షర్మిల!
ఇదిలా ఉంటే రేపో.. ఎల్లుండో షర్మిల ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. సోనియా (Sonia Gandhi), రాహుల్ (Rahul Gandhi) సమక్షంలో వైఎస్సార్‌టీపీని విలీనం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై ఆ పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే అక్టోబర్ 10నే ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు అక్టోబర్-03న తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు. ఈ పర్యటన అనంతరం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పోటీ ఎక్కడ్నుంచి..?
రాష్ట్రంలో ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఇంకోవైపు వైఎస్సాఆర్‌టీపీ విలీన ప్రక్రియ ఎంత వరకు వచ్చిందో క్లారిటీ రాలేదు. మరోవైపు షర్మిల.. ఎప్పుట్నుంచో పాలేరు నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆ సీటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో షర్మిలను సికింద్రాబాద్ నుంచి రంగంలోకి దింపాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఇరు పార్టీల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అసలేం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
Updated Date - 2023-09-30T16:21:15+05:30 IST