ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KA Paul: ‘‘మోదీని చిత్తుగా ఓడించి.. తెలుగు వారి సత్తా చూపిస్తా’’..

ABN, Publish Date - Dec 20 , 2023 | 05:53 PM

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని చిత్తుగా ఓడించి, తెలుగు వారి సత్తా చూపిస్తానంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ..

ఢిల్లీ: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని చిత్తుగా ఓడించి, తెలుగు వారి సత్తా చూపిస్తానంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తారని అంటున్నారని, అదే నిజమైతే ఆయనపై పోటీ చేసి చిత్తుగా ఓడిస్తానని తెలిపారు. తెలంగాణలో తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి మంచి ఆదరణ ఉందని, అందుకు ఆసిఫాబాద్ ఓటర్లే నిదర్శమని చెప్పారు.

ఆసిఫాబాద్‌లో రూపాయి ఖర్చు చేయకుండానే తమ పార్టీ అభ్యర్థికి 2,500 పైగా ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. బీజేపీతో కలిసి పోటీ చేసినా తెలంగాణలో జనసేనకు కనీసం డిపాజిట్ కూడా రాలేదన్నారు. ఇప్పటికైనా జనసేన సైనికులు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలని హితవుపలికారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మూడు నెలల్లో నెరవేర్చకుంటే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవదని జోస్యం చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను విశాఖపట్నం నుంచి నేను ఎంపీగా పోటీ చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనలాంటి వారికి పార్లమెంట్‌కు వెళ్లే అవకాశం కల్పించాలని ఆయన కోరారు.

Updated Date - Dec 20 , 2023 | 05:53 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising