DK Aruna: ఎంఐఎం నేతలు రెచ్చగొడితే ఊరుకోం
ABN, First Publish Date - 2023-09-29T22:25:37+05:30
పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) కార్యాలయంపై ఎంఐఎం కార్యకర్తల దాడి చేయడాన్ని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) ఖండించారు.
కరీంనగర్: పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) కార్యాలయంపై ఎంఐఎం కార్యకర్తల దాడి చేయడాన్ని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) ఖండించారు. శుక్రవారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘‘ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని నోటికి వచ్చినట్లు మాట్లాడే మంత్రి కేటీఆర్, ఇప్పుడు వారి దోస్తు పార్టీ నాయకుల చర్యలకు ఏమి సమాధానం చెప్తారు. బీఅర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ముగ్గురు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చర్యలకు పాల్పడితే సహించేది లేదు. పార్లమెంట్ సభ్యుడి కార్యాలయంపై దాడి జరుగుతుంటే ,శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు ఏమి చేస్తున్నారు’’ అని డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-29T22:25:37+05:30 IST