జాతీయ లోక్ అదాలత్‌కు భారీ స్పందన
ABN , First Publish Date - 2023-09-10T00:25:36+05:30 IST
జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం గోదావరిఖనిలో కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్‌కు భారీ స్పందన లభించింది.

కోల్‌సిటీ, సెప్టెంబరు 9: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం గోదావరిఖనిలో కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్‌కు భారీ స్పందన లభించింది. కార్యక్రమానికి జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి డాక్టర్ శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గోదావరిఖని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి పీ రాజ్‌కుమార్, జూనియర్ సివిల్ జడ్జిలు వెంకటేష్, దుర్గం గణేష్‌లు పాల్గొన్నారు. ఈ లోక్‌అదాలత్‌లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మొదటి అదనపు న్యాయస్థానంలో మొత్తం 856కేసులు పరిష్కారమయ్యాయి. రెండ వ అదనపు న్యాయస్థానంలో మొత్తం 1258 కేసులు పరిష్కారమయ్యాయి. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 1705 కేసులు పరిష్కారమయ్యాయి. ఇక మోటారు వాహనాలకు సంబంధించి ఆరు కేసుల్లో రూ.26లక్షలు క్లెయిమ్ చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. లోక్ అదాలత్ సభ్యులు సంజయ్ కుమార్, ఎన్ కిషన్‌రావు, పీ ప్రవీణ్ కుమార్, ఇరుగుళ్ల సంతోష్, అవినాష్, ముష్కె రవి కుమార్, ముచ్చకుర్తి కుమార్, గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాసరా వు, సీఐలు ప్రమోద్‌రావు, ప్రసాద్‌రావు, ఎస్‌ఐలు జీవన్, వెంకట్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మేడ చక్రపాణి, బోడ సమ్మయ్య, గూళ్ల రమేష్, ప్రదీప్‌కుమార్, ముచ్చకుర్తి కుమార్ పాల్గొన్నారు.