Ponnam Prabhakar: గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయినా రైతులకు సాగు నీరేది..?
ABN, First Publish Date - 2023-08-23T16:15:22+05:30
హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు(Gauravelli Project) పూర్తయి ట్రయల్ రన్ జరిగిన ఇంతవరకు కాలువల నిర్మాణం చేపట్టి రైతులకు సాగునీరు అందించలేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు.
హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు(Gauravelli Project) పూర్తయి ట్రయల్ రన్ జరిగిన ఇంతవరకు కాలువల నిర్మాణం చేపట్టి రైతులకు సాగునీరు అందించలేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. బుధవారం నాడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్(Husnabad)లో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సెక్రెటరీ క్రిస్టోఫర్ తిలక్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సెక్రెటరీ క్రిస్టోఫర్ తిలక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్(Congress) ప్రకటించిన రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్లలోని అంశాలను ప్రజల వద్దకు గడపగడపకు తీసుకెళ్లాలన్నారు. పార్టీ విజయం కోసం కార్యకర్తలందరూ క్షేత్రస్థాయిలో కష్టపడి క్రమశిక్షణతో పని చేయాలని చెప్పారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో కట్టించిన ఇందిరమ్మ ఇళ్లు తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలవడమే కాదు సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో కార్యకర్తలు కూడా గెలిచే విధంగా కార్యకర్తలు కష్టపడి పని చేయాలన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క రూపాయి అభివృద్ధి పనులు కూడా చేయలేదని పొన్నం ప్రభాకర్ అన్నారు.
Updated Date - 2023-08-23T16:15:52+05:30 IST