ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhattivikramarka : కేసీఆర్ అప్పనంగా కాంట్రాక్టర్లకు దోసిపెడుతున్నారు

ABN, First Publish Date - 2023-09-29T18:43:16+05:30

ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ అప్పు తెచ్చి అప్పనంగా కాంట్రాక్టర్లకు దోసిపెడుతు న్నారని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు.

ఖమ్మం: ప్రాజెక్టుల పేరుతో సీఎం కేసీఆర్ అప్పు తెచ్చి అప్పనంగా కాంట్రాక్టర్లకు దోసిపెడుతున్నారని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు.మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భట్టివిక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భట్టి మాట్లాడుతూ..‘‘తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యమే లేదు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఐటీ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలను అడ్డుకోవడం మంచిదికాదు.నిరసన ప్రదర్శనలపై కేటీఆర్ వాఖ్యలు సరికాదు. రాష్ట్రంలో పేదలు ఉపాధి అవకాశాలు కోల్పోయి వీధిన పడుతున్నారు. ఈ రాష్ట్ర బడ్జట్‌తో కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలు అందజేస్తాం. రాష్ట్ర సంపద పేదలకు పంచేందుకే కాంగ్రెస్ గ్యారంటీలను ప్రకటించింది. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్దితిలో లేరు.

ఫామ్‌హౌస్‌లో పడుకునే ముఖ్యమంత్రి కాదు ప్రజల కోసం పని చేసే ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించిన స్ర్కీనింగ్ జరుగుతోంది. సర్వేల ఆధారంగానే ఈసారి సీట్ల కేటాయింపు జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఖమ్మం, నల్గొండ జిల్లాలల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుంది.బీఆర్ఎస్‌కు ఖమ్మం, నల్గొండ జిల్లాలల్లో ఒక్క సీటు కూడా రాదు’’ అని భట్టివిక్రమార్క పేర్కొన్నారు.

Updated Date - 2023-09-29T19:17:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising