Etela Rajender: బీఆర్ఎస్ పార్టీ మొదటగా ఓడిపోయేది ఖమ్మంలోనే
ABN, First Publish Date - 2023-08-25T12:08:31+05:30
బీఆర్ఎస్ పార్టీ (BRS Party) మొదటగా ఓడిపోయే జిల్లా ఖమ్మం అని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (BJP MLA Etela Rajender) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ (CM KCR) పరిపాలన మీద ప్రజలు విసుగు చెందారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాకూడదని అన్ని వర్గాల ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.
ఖమ్మం: బీఆర్ఎస్ పార్టీ (BRS Party) మొదటగా ఓడిపోయే జిల్లా ఖమ్మం అని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (BJP MLA Etela Rajender) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ (CM KCR) పరిపాలన మీద ప్రజలు విసుగు చెందారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాకూడదని అన్ని వర్గాల ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో గెలిచి తీరాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), అమిత్ షా (Amit Shah)లను ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఆదేశించారన్నారు. 2019 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అధికార దుర్వినియోగంతో అరకొరగా ఎక్కడో ఒక చోట గెలిచిందన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ మాత్రం ఏ ఒక్క ఎన్నికలోనూ విజయం సాధించలేదన్నారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలి అంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. బీజేపీ సారథ్యంలో దేశం సుభిక్షంగా ఉందన్నారు. 27న మధ్యాహ్నం 2 గంటలకు సభ జరుగుతుందని ఆయన తెలిపారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మనం సభ ఏర్పాటు చేయకూడదని సభను రెండు సార్లు వాయిదా వేశామన్నారు. గత 4,5 రోజులుగా అమిత్ షా సభ ఏర్పాట్లు క్షేత్ర స్థాయిలో జరుగుతున్నాయన్నారు. ఖమ్మం జిల్లా ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీ పార్టీకి అండగా ఉందని నిరూపించాలన్నారు. రైతాంగాన్ని దెబ్బలు కొట్టి బేడీలు వేసి జైలుకి పంపింది ఈ జిల్లాలో జరిగిన ఘటనే అని అన్నారు. అత్యధికంగా గిరిజనులు ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా అని పేర్కొన్నారు. గిరిజనులు అడివిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారన్నారు. గిరిజనులు ఫారెస్ట్ అధికారుల కాళ్ళు పట్టుకుని బతిమిలాడుకున్న పరిస్థితి ఖమ్మం జిల్లాలోనే జరిగిందని గుర్తుచేశారు. మార్పుకు నాంది పలికే జిల్లా అభివృద్ధిని కోరుకునే జిల్లా ఖమ్మం జిల్లా అని అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు ధర్మానికి న్యాయానికి అండగా ఉంటారన్నారు. రైతుబంధు తరహాలో కుంట భూమి ఉన్నా 6 వేలు ఇచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీది అని చెప్పుకొచ్చారు. ఎరువుల మీద సబ్సిడీ ప్రకటించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని ఈటల రాజేందర్ వెల్లడించారు.
Updated Date - 2023-08-25T12:34:39+05:30 IST