ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Thummala: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిప్పులా ఉండాలి

ABN, First Publish Date - 2023-12-10T17:55:03+05:30

కాంగ్రెస్ పార్టీ ( Congress party ) కార్యకర్తలు నిప్పులా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Thummala Nageswara Rao ) పేర్కొన్నారు. ఆదివారం నాడు జిల్లాలోని పాల్వంచ సుగుణ గార్డెన్‌లో కాంగ్రెస్, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు.

భద్రాద్రి కొత్తగూడెం: కాంగ్రెస్ పార్టీ ( Congress party ) కార్యకర్తలు నిప్పులా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Thummala Nageswara Rao ) పేర్కొన్నారు. ఆదివారం నాడు జిల్లాలోని పాల్వంచ సుగుణ గార్డెన్‌లో కాంగ్రెస్, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య , మట్టా రాగమయి జారే ఆదినారాయణ, రాందాస్‌కి సన్మానం చేశారు. వీరికి భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... ‘‘ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అవమానాలు సహించలేరు. ఆత్మ గౌరవం కోసం కాంగ్రెస్ సీపీఐ పార్టీలను గెలిపించిన ప్రజానీకానికి శిరస్సు వహించి నమస్కరిస్తోన్నాను. వసూళ్లు లేని కబ్జాలు లేని ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటుంది. తల వంచే పరిస్థితి జీవితంలో రాదు. సీతారామ ప్రాజెక్ట్ గత ప్రభుత్వంలో నత్త నడకన సాగింది. సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేసి గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తాం. ఈ దేశానికే అన్నం పెట్టే శక్తి తెలంగాణకు ఉంది. పామాయిల్ సాగుతో రైతుల తలరాత మారుస్తాం. వ్యవసాయం రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతాం’’ అని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Updated Date - 2023-12-10T17:55:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising