Revanth Challenge: కేటీఆర్‌కు రేవంత్ సవాల్... మీరు సత్యవంతులైతే రండి...
ABN, First Publish Date - 2023-02-10T11:58:07+05:30
మంత్రి కేటీఆర్, టీపీపీసీ చీఫ్ రేవంత్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
ఖమ్మం: మంత్రి కేటీఆర్ (Minister KTR), టీపీపీసీ చీఫ్ రేవంత్ (TPCC Chief Revanth Reddy) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భూకబ్జాలపై అసెంబ్లీ (Telangana Assembly) లో కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై రేవంత్ వరుసగా కౌంటర్‌లు ఇస్తున్నారు. నిన్న కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ టీపీసీసీ చీఫ్ ఈరోజు మరోసారి మంత్రిపై సవాల్‌కు సిద్ధమయ్యారు. కేటీఆర్ ఆస్థులపై.. తన ఆస్థులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. సమాచార హక్క సామాన్యుడి ఆయుధమని... తమ భూకుంభకోణాలను భయట పెట్టేందుకే సమాచార హక్కును ఆశ్రయిస్తున్నామని తెలిపారు. సమాచార హక్క లేకపోతే తమరి కుంభకోణాలకు సంబంధించి సమాచారం ఎవరిస్తారన్నారు. వట్టినాగులల్లి నుంచి మియాపూర్ వరకూ కేటీఆర్ వేల కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘‘నేను స్పష్టమైన ఆరోపణ చేస్తున్నా... మీరు సత్యవంతులే అయితే సిట్టింగ్ జడ్జి విచారణకు రండి’’ అంటూ సవాల్ చేశారు. ధరణి పోర్టల్ (Dharani Portal) పెద్ద కుంభకోణమని విమర్శించారు. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో జరిగిన భూలావాదేవీలపై సిట్టింగ్ జడ్జి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ భూ కుభకోణంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలన్నారు. తాను కూడా ఎటువంటి విచారణ కైనా సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
అసెంబ్లీ సాక్షిగా రేవంత్‌పై సంచలన ఆరోపణలు
కాగా.. నిన్న అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్‌మెయిలర్ అని అన్నారు. హైదరాబాద్ (Hyderabad) శివారు భూములపై ఓ దుకాణం పెట్టుకుని దందాలకు పాల్పడుతూ, కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘వాళ్ల పార్టీకి ఒక అధ్యక్షుడిని పెట్టుకున్నారు. ఆయన పేరు నేను చెప్పను కానీ, ప్రగతిభవన్‌ను బాంబులతో బద్దలు కొడతాం. బయట బ్లాక్ మెయిల్‌లు చేస్తాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్‌ను రూట్ టు ఇన్‌కమ్‌గా మార్చుకుంటాం. ఆర్టీఐ పేరిట బయట అడ్డగోలుగా దందాలు చేస్తాం అంటాడు. రంగారెడ్డి జిల్లా భూములు, హైదరాబాద్ భూములపై మీ పార్టీ అధ్యక్షుడి దగ్గర ఒక సపరేటు దఫ్తర్ నడుస్తుంది. ఆ దఫ్తర్‌లో రిటైర్డ్ తహసీల్దార్లతో సహా కొంతమందిని కూర్చోబెట్టుకొని ప్రభుత్వాన్ని, ప్రైవేట్ వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇలా కోట్లాది రూపాయలు వసూలు చేసేవాళ్లకు ధరణి వల్ల ఇబ్బంది ఉంటుంది’’ అంటూ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో అధికారపార్టీ, కాంగ్రెస్ మధ్య మాటల దుమారం చెలరేగింది.
Updated Date - 2023-02-10T11:58:08+05:30 IST