ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tummala: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తుమ్మల.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

ABN, First Publish Date - 2023-09-16T16:38:53+05:30

గత కొంతకాలంగా బీఆర్ఎస్‌(BRS)కు దూరంగా ఉంటున్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) నేడు కాంగ్రెస్(Congress) తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో తుమ్మల కాంగ్రెస్‌లో చేరారు.తుమ్మలకు పార్టీ కండువా కప్పి ఖర్గే పార్టీలోకి సాదర స్వాగతం పలికారు.

ఖమ్మం: గత కొంతకాలంగా బీఆర్ఎస్‌(BRS)కు దూరంగా ఉంటున్న మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) నేడు కాంగ్రెస్(Congress) తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో తుమ్మల కాంగ్రెస్‌లో చేరారు.తుమ్మలకు పార్టీ కండువా కప్పి ఖర్గే పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. తుమ్మల చేరిక కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య....కేసీ వేణుగోపాల్ రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. అయితే తుమ్మల కాంగ్రెస్ చేరడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా(Khammam District) రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారుతున్నాయి. తమ్మలతో పాటే ఆయన అనుచరులు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కీలక నేతలు కూడా కొద్దిరోజుల్లోనే కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి. తుమ్మలకు ఖమ్మం అసెంబ్లీ(Khammam Assembly) నియోజకవర్గం టికెట్‌ ఇచ్చే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. తుమ్మల నాగేశ్వరరావు‌ గతంలో ప్రాతినిధ్యం వహించిన పాలేరు టికెట్‌ కోసం పొంగులేటి ఇప్పటికే దరఖాస్తు చేశారు. ఈ రెండు స్థానాల విషయంలో వీరిద్దరి మధ్య సర్దుబాటు చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. ఆయన చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలం పెరిగే అవకాశం ఉంది.

తుమ్మలకు ఖమ్మం జిల్లా అభివృద్ధిలో మంచి పేరుంది. రాజకీయ చదరంగంలో తుమ్మలకు ఉన్న అనుభవం కూడా కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను చక్రం తిప్పడంలో తుమ్మల సిద్ధహస్తులు. తుమ్మల నాగేశ్వరరావు‌కు బలమైన క్యాడర్ కూడా ఉంది. మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో టీడీపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల్లో మంత్రి పదవులు నిర్వహించిన తుమ్మల.. అభివృద్ధి పనులపైనే ప్రధానంగా దృష్టి పెట్టి జిల్లాపై తనదైన ముద్ర వేశారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో తుమ్మల నాగేశ్వరరావు‌ ప్రభావంతో కాంగ్రెస్‌కు మరిన్నీ సీట్లు పెరగవచ్చని కాంగ్రెస్ అధిష్ఠానం అంచనా వేస్తోంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణంలోని కమ్మ సామాజిక వర్గ ఓట్లను కూడా తుమ్మల ప్రభావితం చేసే అవకాశాలు ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ ఆ సామాజిక వర్గంలోని ఓట్లను కోల్పోయే ప్రమాదముంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే పొంగులేటి రూపంలో బీఆర్ఎస్‌కు గట్టి దెబ్బ తగులుతుండగా.. ఇప్పుడు తుమ్మల కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలహీన పడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈసారి కూడా గతంలో లాగానే కాంగ్రెస్‌కు ఖమ్మం కంచుకోటగా నిలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - 2023-09-16T17:18:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising