ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KMM: ఎన్నికల వేళ.. కాంగ్రెస్‏కు బిగ్ షాక్.. బీఆర్ఎస్‏లో చేరిన మాజీమంత్రి

ABN, First Publish Date - 2023-11-11T12:24:33+05:30

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీమంత్రి సంబాని చంద్రశేఖర్‌(Former Minister Sambani Chandrasekhar), టీపీసీసీ అధికార

ఖమ్మం: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీమంత్రి సంబాని చంద్రశేఖర్‌(Former Minister Sambani Chandrasekhar), టీపీసీసీ అధికార ప్రతినిఽధి కోటూరి మానవతారాయ్‌ సీఎం కేసీఆర్‌ సమక్షంలో శుక్రవారం బీఆర్‌ఎ్‌సలో చేరారు. తొలుత వారిద్దరు కాంగ్రెస్‏కు రాజీనామా చేస్తున్నట్టు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి తమ రాజీనామా లేఖలను పంపారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర వీరిని హైదరాబాద్‌ ఫామ్‌హౌజ్‌లో ఉన్న సీఎం కేసీఆర్‌ వద్దకు తీసుకెళ్లగా.. కేసీఆర్‌ వారికి ఆహ్వానం పలికారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5:30నిమిషాల వరకు కేసీఆర్‌ సంబానితో భేటీ అయ్యారని, ప్రస్తుత ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితులు, కాంగ్రె్‌సలో తనకు జరిగిన అవమానం గురించి సంబాని కేసీఆర్‌(KCR)కు వివరించారని సమాచారం. ఆ తర్వాత సంబాని ‘ఆంధ్య్రజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడారు. బీఆర్‌ఎస్‏లో తనకు రాజకీయంగా తగిన గౌరవం కల్పిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారని, ఉమ్మడి జిల్లా పది నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి పనిచేయాలని కోరారని వివరించారు. ఇకపై తాను ఉమ్మడిఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. అలాగే సంభాని, మానవతారాయ్‌తో పాటు ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా, ఇల్లెందు నియోజకవర్గాలకు చెందిన నేతలు ఎడవల్లి కృష్ణ, డాక్టర్‌. రాంచందర్‌నాయక్‌, మడత వెంకట్‌గౌడ్‌ కూడా బీఆర్‌ఎ్‌సలో చేరారు. అంతకుముందు వారంతా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలవగా కేటీఆర్‌ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2023-11-11T12:24:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising