ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: ఇక.. రంగంలోకి కేటీఆర్‌.. 15 నుంచి గ్రేటర్‌లో ప్రచారం..?

ABN, First Publish Date - 2023-11-08T07:34:19+05:30

గ్రేటర్‌ ఎన్నికల ప్రచార రంగంలోకి బీఆర్‌ఎస్‌(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) దిగనున్నారు.

- సాయంత్రం వేళ రోడ్‌ షోలు

- 25న కేసీఆర్‌ బహిరంగ సభ

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ ఎన్నికల ప్రచార రంగంలోకి బీఆర్‌ఎస్‌(BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) దిగనున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి పలు నియోజకవర్గాల్లో కేటీఆర్‌ రోడ్‌ షోలు జరగనున్నాయి. ప్రజలను ఆకట్టుకోవడం, పార్టీ శ్రేణుల్లో జోష్‌ మరింత పెంచడం లక్ష్యంగా కేటీఆర్‌ ప్రచారం నిర్వహించనున్నారు. నామినేషన్‌ ఉపసంహరణ గడువు ముగియనున్న 15వ తేదీ నుంచి 22 వరకు కేటీఆర్‌ రోడ్‌ షోలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరి, మేడ్చల్‌(Secunderabad, Malkajgiri, Medchal) లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం ఉండనుంది. పురపాలక, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ హైదరాబాద్‌ అభివృద్ధిపై మొదటి నుంచీ ప్రత్యేక దృష్టి సారించారు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆయన విస్తృతంగా ప్రచారం చేయగా.. పార్టీ రికార్డు స్థాయిలో 99 స్థానాలు దక్కించుకుంది. 2020 గ్రేటర్‌ ఎన్నికల్లో 56 సీట్లకు పరిమితమైంది.

Updated Date - 2023-11-08T07:34:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising