Jupalli Krishna Rao: నా ఇంట్లో వైఎస్సార్ ఫోటో అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ఉంటదన్న జూపల్లి
ABN, First Publish Date - 2023-04-11T14:15:44+05:30
బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
నాగర్‌కర్నూల్: బీఆర్‌ఎస్ (BRS) నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Former Minister Jupalli Krishna Rao) మరోసారి ప్రభుత్వం (Telangana Government)పై విరుచుకుపడ్డారు. ‘‘సస్పెన్షన్‌తో నా కిరీటం కింద పడలే.. మీ కిరిటమే పడింది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. భావ స్వేచ్ఛ ఉందని.. ఎక్కడ సమావేశం నిర్వహించినా వెళతానని.. అలాగే కొత్తగూడెంకు కూడా వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. తాను అడిగిన ప్రశ్నలకు తప్ప అన్ని విషయాలపై మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) మాట్లాడారని అన్నారు. తనను సస్పెండ్ చేశారు కానీ మూడేళ్లుగా తనకు సభ్యత్వం పుస్తకాలే ఇవ్వలేదన్నారు. పార్టీ నుంచి సస్పెండ్‌తో పంజరం నుంచి బయటపడ్డట్టు ఉందన్నారు. ‘‘మిస్టర్ నిరంజన్ రెడ్డి.. 88 స్థానాలు వచ్చినంక మనం మొనగాళ్ళమే కదా.. ఏం అవసరం ఉందని.. 12 మందిని చేర్చుకున్నారు.. ప్రశ్నించే గొంతు వద్దనా.. లేక తెలంగాణ(Telangana) ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)ని ముంచాలనా.. నేను 2001లో కరెంట్ బిల్లులు కట్టమని.. ఫ్రీ కరెంట్ ఇవ్వాలని పాదయాత్ర చేసిన.. జైల్‌కు వెళ్ళిన.. మా ఇంట్లో వైఎస్సార్ ఫోటో అప్పుడు ఉంది.. ఇప్పుడు ఉంది.. ఎప్పుడూ ఉంటది.. సీఎం కేసీఆర్ (CM KCR) ఫోటో కూడా ఉంటది’’ అని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
మంగళవారం కొల్లపూర్‌లో జూపల్లి.. ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా.. భారీగా జూపల్లి అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా అంబేద్కర్, జ్యోతిరావుపూలే, తెలంగాణ అమరవీరుల స్థూపాలకు జూపల్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Updated Date - 2023-04-11T14:15:44+05:30 IST