కళ్లకు గంతలు కట్టి బంగారం దోపిడీ

ABN , First Publish Date - 2023-02-22T23:32:11+05:30 IST

ఓ వృద్ధురాలి కళ్లకు గంతలు కట్టి బంగారాన్ని దోపిడీ చేసిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలంలోని పెద్దరేవల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. డీఎస్పీ మహేష్‌ కథనం ప్రకారం వివరాలు ఇలాఉన్నాయి.

కళ్లకు గంతలు కట్టి బంగారం దోపిడీ

బాలానగర్‌, ఫిబ్రవరి 22 : ఓ వృద్ధురాలి కళ్లకు గంతలు కట్టి బంగారాన్ని దోపిడీ చేసిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలంలోని పెద్దరేవల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది. డీఎస్పీ మహేష్‌ కథనం ప్రకారం వివరాలు ఇలాఉన్నాయి. పెద్దరేవల్లి గ్రామానికి చివరలో ఉన్న ఇంట్లో పద్మమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆమె పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. పద్మమ్మ ధరించిన బంగారు నగలు, గాజులపై కన్నేసిన దుండగులు మంగళవారం రాత్రి ఇంట్లోకి చొరబడి ఆమె కళ్లకు గంతలు కట్టారు. అనంతరం కాళ్లు, చేతులు కట్టేసి ఆమె ఒంటిపై ఉన్న ఏడున్నర తులాల బంగారు నగలను దోపిడీ చేశారు. బంగారు గాజులను బలవంతంగా లాగడంతో తన చేతులు నొప్పి అయ్యాయని, దీంతో తానే తీసి దుండగులకు ఇచ్చినట్లు బాధితురాలు తెలిపారు. అయితే గతంలో కూడా చిన్న చిన్న దొంగతనాలు పద్మమ్మ ఇంట్లో జరిగాయి. వీటన్నింటికి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. డీఎస్పీ మహేష్‌ బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పద్మమ్మతో వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జడ్చర్ల టౌన్‌ సీఐ రమేష్‌బాబు, రాజాపూర్‌ ఎస్సై వెంకట్‌రెడ్డి, క్లూస్‌టీం సభ్యులు విచారణలో పాల్గొన్నారు.

Updated Date - 2023-02-22T23:32:12+05:30 IST