Share News

Viral News: డ్రమ్‌లో ఉండాలనుకోవడం లేదు..మోసం చేసిన భార్యను వదిలేసిన భర్త..

ABN , Publish Date - Apr 10 , 2025 | 09:15 PM

ప్రస్తుత రోజుల్లో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒక భర్త తన భార్యను, ఆమె ప్రేమికుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Viral News: డ్రమ్‌లో ఉండాలనుకోవడం లేదు..మోసం చేసిన భార్యను వదిలేసిన భర్త..
viral news

రోజురోజుకు వివాహేతర సంబంధాలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతి చోటు కూడా ఏదో ఒకటి వెలుగులోకి రావడం ప్రస్తుతం చర్చనీయాశంగా మారుతోంది. ఈ క్రమంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంఘటనలో ఒక భర్త తన భార్యను, ఆమె ప్రేమికుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ వ్యవహారం పట్ల తన ఆవేదనను తెలియజేస్తూ ఒక వీడియో ద్వారా వెల్లడించారు. అది ప్రస్తుతం వైరల్ అవుతోంది.


బాధపడిన భర్త

పవన్, యూపీ మహోబా జిల్లాలో ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్నాడు. అతని భార్య రీతు వర్మ, స్థానిక ప్రభుత్వ బాలికల కళాశాలలో గుమస్తాగా పనిచేస్తోంది. అయితే, తన భార్యకు స్థానిక కౌన్సిలర్ అభిషేక్ పాఠక్‌తో సంబంధం ఉన్నట్లు తెలిసిన పవన్ తీవ్రంగా బాధపడ్డాడు. ఆ క్రమంలోనే ఒక రోజు తన భార్య అతనితో చాట్ చేస్తున్నప్పుడు గమనించి, చాటింగ్‌ ముగించాలని ఆమెను కోరాడు. ఆ క్రమంలో ఆమె నా శరీరం, నా ఇష్టం, నేను ఏం చేయాలనుకుంటే అది చేయగలను. నన్ను ఆపడానికి నువ్వు ఎవరని అడిగిందని పవన్ అన్నాడు. కానీ ఆ తర్వాత పవన్ తన భార్యతో కాకుండా విడిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కానీ అప్పటికే వీరికి ఓ బాబు ఉన్నాడు. బాబు తల్లితో ఉంటుండగా, తండ్రి పవన్ వేరే చోట ఉంటున్నాడు.


చివరకు రంగంలోకి

ఆ క్రమంలోనే ఓ రోజు రాత్రి, పవన్ తన కొడుకు కోసం వీడియో కాల్ చేసి మాట్లాడుతున్న క్రమంలో అక్కడ వేరే వ్యక్తి ఉన్నట్లు అతనికి అనిపించింది. ఆ క్రమంలో ఆమె కాల్ డిస్‌కనెక్ట్ చేసిందని పవన్ పేర్కొన్నాడు. ఈ సంఘటనపై పవన్ మానసికంగా ఎంతో ఇబ్బంది పడి, చివరకు పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలిపాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ అద్దె ఇంటికి చేరుకుని, తలుపు తెరవడానికి ప్రయత్నించారు. చాలా ప్రయత్నాల తరువాత, వారు డోర్ తెరిచారు. ఆ క్రమంలో కౌన్సిలర్ అభిషేక్ పాఠక్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ క్రమంలో పవన్ అతన్ని పట్టుకున్నాడు.


కానీ చివరకు మాత్రం..

అతను స్థానిక కౌన్సిలర్‌ కాగా, ఆమె, తన ప్రభావాన్ని ఉపయోగించి చంపేందుకు కూడా వెనుకాడదన్నారు పవన్. తాను డ్రమ్‌లో ఉండటం ఇష్టం లేదన్నాడు. అవసరమైతే తన కుమారుడికి కూడా విషం ఇచ్చి చంపే ఛాన్సుందన్నారు. కాబట్టి ఆమె ఎవరితోనైనా జీవించవచ్చు. కానీ నా బిడ్డకు ఏమీ జరగకూడదని కోరుతున్నానని పవన్ పోలీసులకు తెలిపాడు. ఈ అంశంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

EPFO: పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..

Gold Price Fluctuations: అసలు గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది..కారణాలేంటి

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 10 , 2025 | 09:17 PM