Telangana Rains: భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు.. వాటి వివరాలు..
ABN, First Publish Date - 2023-07-27T14:40:43+05:30
మహబూబ్‌నగర్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. రైల్వే ట్రాక్‌లపై కూడా వర్షపు నీరు వచ్చి చేరడంతో పలు రైళ్లను దక్షణ మధ్య రైల్వే రద్దు చేసింది.
మహబూబ్‌నగర్: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజల నరకయాతన అనుభవిస్తున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. రైల్వే ట్రాక్‌లపై కూడా వర్షపు నీరు వచ్చి చేరడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా హసన్ పర్తి- కాజిపేట మార్గంలో ట్రాక్‌పైకి భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వెంటనే రైల్వేశాఖ అప్రమత్తమైంది. ఆ మార్గంలో నడిచే మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. అలాగే 11 రైళ్లను దారి మళ్లించింది.
రద్దయిన రైళ్లు :
సిర్‌పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ - 17012
సికింద్రాబాద్ - సిర్‌పూర్ కాగజ్ నగర్ - 17233
సిర్‌పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ - 17234 రైళ్లు రద్దు
పాక్షికంగా రద్దయిన రైళ్లు :
తిరుపతి -కరీంనగర్ -12761,
కరీంనగర్ -తిరుపతి -12762,
సికింద్రాబాద్ - సిర్‌పూర్ కాగజ్‌నగర్ -12757
సిర్‌పూర్ కాగజ్‌నగర్ -సికింద్రాబాద్ -12758
Updated Date - 2023-07-27T14:42:53+05:30 IST