ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maheswar Reddy : హస్తినకు మారిన కాంగ్రెస్ రాజకీయం.. ఖర్గేను కలిసేందుకు మహేశ్వర్ రెడ్డి యత్నం

ABN, First Publish Date - 2023-04-13T12:37:42+05:30

నేటి ఉదయం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఖర్గే అపాయింట్‌మెంట్ కోసం యత్నిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ : నేటి ఉదయం కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఖర్గే అపాయింట్‌మెంట్ కోసం యత్నిస్తున్నారు. ఖర్గేతో మాట్లాడిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఇప్పటికే మహేశ్వర్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. నిన్న ఆయనకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయిపోయారు. ఖర్గేను కలిసిన మీదట తన వైఖరి వెల్లడిస్తానని పేర్కొన్నారు.

నిన్న తనకు నేను ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్‌ను. నన్ను నియమించింది సోనియా గాంధీ. నాకు నోటీస్ ఇవ్వాల్సింది కూడా ఏఐసీసీ. పార్టీలో కొత్తగా వచ్చిన వారికి నియమావళి తెలవదు. నేను పార్టీ మారుతున్నట్లు నిన్నటి నుంచి నా మీద కొన్ని వదంతులు వస్తు న్నాయి. పదే పదే ఇలాంటి ప్రచారం జరగడం బాధాకరం. నాకు షోకాజ్ ఎందుకు ఇచ్చారో వారే సమాధానం చెప్పాలి. నాకు షోకాజ్ ఇచ్చే అర్హత ఉందా ఆలోచించాలి. నా మీద కొందరు కక్ష సాధింపు చేస్తున్నారు. పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చైర్మన్ కావాలని కోరుకున్న వ్యక్తిని నేను. ఆయన టీపీసీసీ పీసీసీ చైర్మన్ కావడానికి నా వంతు కృషి చేశా. సీనియర్లు, రేవంత్ మధ్య గ్యాప్ లేకుండా కూడా నేను ప్రయత్నం చేశా’’ అని పేర్కొన్నారు.

ఏ రోజు నేను పార్టీ గీత దాటలేదు..

ఇంకా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఏ రోజు నేను పార్టీ గీత దాటలేదు. అంతర్గత సమావేశాల్లో మాత్రమే నేను మాట్లాడినా. రేవంత్ వెలుమ కమ్యూనిటీ మీద మాట్లాడినప్పుడు మాత్రమే నేను మాట్లాడలేదు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి అంటే నాకు అభిమానం. సీనియర్ల మీటింగ్ నా ఇంట్లో ఉంటే దిగ్విజయ్ కోరిక మేరకు వాయిదా వేశాం. జనరల్ సెక్రటరీని మార్చమని మేము ఎప్పుడూ కోరలేదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా. షోకాజ్ ఇవ్వడం బాధాకరం. ఖర్గేను కలిసి నిర్ణయం తీసుకుంటా. నేను పార్టీ మారాలంటే బాజాప్త రాజీనామ చేసి వెళతా. నేను పార్టీ మారాలని ఏ రోజు అనుకోలేదు

నా సమావేశాలకు బీజేపీ నేత అటెండ్ అయ్యారనే ది పచ్చి అబద్ధం. అమిత్ షా ను బీజేపీ పెద్దలను కలిసేవారికి షోకాజ్ ఇచ్చే దైర్యం లేదు. కానీ నాకు ఎందుకు ఇచ్చారో అర్దం కావడం లేదు’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-04-13T12:37:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising