ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Assembly Elections: సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నర్సారెడ్డి హాట్ కామెంట్స్

ABN, First Publish Date - 2023-10-21T14:40:36+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తూముకుంట నర్సారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఎం కేసీఆర్ గజ్వెల్‌లో కాకుండా వేరే నియోజకవర్గంలో గజ్వెల్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టి నాపై దయ చూడాలని, ఇకపై నెలకు ఒక సారి మీతో ఉంటా అని చెప్పే దుస్థితికి వచ్చింది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తూముకుంట నర్సారెడ్డి (Congress MLA candidate Tumukunta Narsa Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఎం కేసీఆర్ గజ్వెల్‌లో కాకుండా వేరే నియోజకవర్గంలో గజ్వెల్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టి నాపై దయ చూడాలని, ఇకపై నెలకు ఒక సారి మీతో ఉంటా అని చెప్పే దుస్థితికి వచ్చింది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాలలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి కాని ఎప్పుడు వాళ్ళ కార్యకర్తలను బ్రతిమిలాడలేదన్నారు. 10 సంవత్సరాలలో గజ్వెల్ నియోజకవర్గం మండలాలకు ఇంతవరకు వెళ్ళలేదన్నారు. రైతు ఆత్మహత్యలు చేసుకుంటే, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాక ఎంతో మంది చనిపోయారని.. ఇంత వరకు వారిని పట్టించుకోలేదన్నారు. సిద్దిపేట నుంచి గజ్వెల్‌కు బ్రతికి వచ్చిన తమరు గజ్వెల్‌పై సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. ఇంతవరకు గజ్వెల్‌కు ఏమీ చేయలేదని.. ఇకపై చేస్తా అని అంటున్నారు, అంటే ముఖ్యమంత్రికి 8 సంవత్సరాలు సరిపోదా అని ఆయన ప్రశ్నించారు.


ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లో గజ్వెల్‌లో ఒడిపోతాననే భయంతోనే కార్యకర్తలతో మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుతున్నారన్నారు. ‘‘నేను గజ్వేల్ లోకల్ వాడిని మీతోనే ఉంటా’’ అని చెప్పుకొచ్చారు.5 సంవత్సరాలలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినవి కూడా కేసీఆర్ 10 సంవత్సరాలలో ఇవ్వలేదని మండిపడ్డారు. దత్తత తీసుకున్న గ్రామాలలో కూడా పెంకుటిల్లు కూల్చి ఇప్పటి వరకు వారికి డబుల్ బెడ్ రూమ్‌లు ఇవ్వలేదన్నారు. వర్గల్‌లో ప్రభుత్వ భూమిని తీసుకొని వారికి సరైన నష్టపరిహారం కూడా ఇవ్వకుండా, వాళ్ళకి ఇస్తానన్న ప్లాట్‌కు కూడా ఇవ్వకుండా ఆ భూములను కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మల్లన్నసాగర్‌లో భూములు కోల్పోయిన వారికి ఇప్పటికి ప్యాకేజీలు, డబుల్ బెడ్ రూమ్‌లు ఇవ్వకుండా వాళ్ళను అడ్డా మీద కూలీలను చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే భూ నిర్వాసితులకు సరైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, గజ్వెల్ ప్రజల ఆశీర్వాదంతో గజ్వెల్‌లో గెలిచాక కేసీఆర్ చేయని అభివృద్ధిని తాను చేసి చూపిస్తానని నర్సారెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2023-10-21T14:40:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising