Harish Rao: పార్లమెంట్ ఎన్నికల కోడ్‌ని సాకుగా చూపి 6 గ్యారెంటీలను అమలు చేయరేమో...?
ABN, Publish Date - Dec 31 , 2023 | 02:41 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారని.. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల కోడ్‌ని సాకుగా చూపి హామీలను అమలు చేయరేమోననిపిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ( Harish Rao ) తెలిపారు. ఆదివారం నాడు ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే ఎలా అనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. దరఖాస్తులతో కోడ్ వరకు సాగదీసి కోడ్‌ను సాకుగా చూపి హామీలను అమలు చేయరనిపిస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారని.. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల కోడ్‌ని సాకుగా చూపి హామీలను అమలు చేయరేమోననిపిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ( Harish Rao ) తెలిపారు. ఆదివారం నాడు ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే ఎలా అనే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. దరఖాస్తులతో కోడ్ వరకు సాగదీసి కోడ్‌ను సాకుగా చూపి హామీలను అమలు చేయరనిపిస్తుందన్నారు. బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ పెట్టి దాటవేస్తారేమోనని అని చెప్పారు. ఫిబ్రవరిలోనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గైడ్ లైన్స్ లేకుండా దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది... నిజానికి మొదట గైడ్ లైన్స్ విడుదల చేయాలని అలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు.
6 గ్యారెంటీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే స్పష్టత లేదన్నారు. కోడ్ ఇబ్బంది రావొద్దు అంటే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి మూడోవారంలోపు నిబంధనలు విడుదల చేసి ఉత్తర్వులు ఇవ్వాలి.. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కోరారు. రైతులకు బోనస్ ఇవ్వడంపై ఇప్పుడే నిర్ణయం తీసుకుని జీఓ ఇవ్వాలని చెప్పారు. ఇప్పటి వరకు ఎంత రైతు బంధు వేశారో వైట్ పేపర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కరోనా కాలంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని...అది తమకు రైతుల పట్ల ఉన్న కమిట్ మెంట్ అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే కోతలు, దాటవేత, ఎగవేతలకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చిత్తశుద్ది ఉంటే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో పది లక్షల ఆరోగ్య శ్రీని పేదలు ప్రయోజనం పొందారో చెప్పాలన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఏఐసీసీ అగ్ర నేతలు ప్రియాంక, రాహుల్ గాంధీ చెప్పారని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాము చెప్పలేదని సభలో మాట మార్చారని.. ఇది ఎగవేతనే కదా అని ప్రశ్నించారు. ఏ తేదీన ఏ నోటిఫికేషన్ ఇస్తారో డేట్ల వారీగా పేపర్ ప్రకటనలు ఇచ్చారన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకుంటే యువతను మోసం చేసినట్టేనని అన్నారు. కేసీఆర్ కార్లను కొన్నది నిజం, బీపీ కోసం ఇచ్చింది నిజమని.. ప్రభుత్వం కొంటే అది ప్రజల ఆస్తి.. మీరు వాడుకోవాలని సూచించారు. కార్లకు బీపీ చేసే మెకానిజం విజయవాడలోనే ఉందన్నారు. అక్కడ దాచారని చెప్పడం సీఎం స్థాయికి తగదని ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
Updated Date - Dec 31 , 2023 | 03:03 PM