Konda surekha : పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాటలు హస్యాస్పదంగా ఉన్నాయి
ABN, Publish Date - Dec 30 , 2023 | 08:46 PM
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ( Palla Rajeshwar Reddy ) ప్రొటోకాల్ గురించి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ( Konda surekha ) ఎద్దేవా చేశారు. శనివారం నాడు సిద్దిపేట జిల్లాలోని హరిత హోటల్లో కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు.
సిద్దిపేట: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ( Palla Rajeshwar Reddy ) ప్రొటోకాల్ గురించి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ( Konda surekha ) ఎద్దేవా చేశారు. శనివారం నాడు సిద్దిపేట జిల్లాలోని హరిత హోటల్లో కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రాజేశ్వర రెడ్డి సమీక్ష సమావేశం నుంచి ఉన్నట్టుండి వెళ్లిపోయారు. కాంగ్రెస్ నాయకులను స్టేజీ మీదకు పిలిచే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది.సమీక్షలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిని స్టేజీ మీదకు ఎలా ఆహ్వానిస్తారని సమావేశాన్ని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బహిష్కరించారు.
ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. కొమురవెల్లి మల్లన్న జాతర ప్రతి సంవత్సరం జరుగుతుందని.. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు. పోల్స్ సిఫ్టింగ్ చేయాలని చెప్పారు. దేవాలయంలో ఉన్న నిధులతోనే జాతర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు. బీఆర్ఎస్ నేతలకు ఈ సమావేశంలో ఉండబుద్దిగాక వెళ్లిపోయారని మండిపడ్డారు. తమకు ఎవరైనా స్పెషల్‌గా పిలుచుకునే అధికారం ఉంటుందని పేర్కొన్నారు.
Updated Date - Dec 30 , 2023 | 08:46 PM