ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KTR: ‘ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్తు’

ABN, First Publish Date - 2023-04-24T16:23:12+05:30

జిల్లాలోని జహీరాబాద్‌లో మహింద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్‌న్‌ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లాలోని జహీరాబాద్‌లో మహింద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్‌న్‌ను మంత్రి కేటీఆర్ (Minister KTR) సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...రూ.1000 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మున్ముందు ప్లాంట్‌ను మరింతగా విస్తరిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకంగా, అవినీతి లేకుండా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా దరఖాస్తు చేసిన 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నామన్నారు. జహీరాబాద్‌లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్తన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగాన్ని ప్రోత్సాహించేందుకు ప్రత్యేక పాలసీ తీసుకువచ్చామన్నారు. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేసామన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 23 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. 3 లక్షల 30 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-04-24T16:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising