ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS BJP : హస్తినలో హాట్ హాట్‌గా తెలంగాణ బీజేపీ పాలిటిక్స్.. ‘దెబ్బ కొడితే దిమ్మతిరగాలి’ అంటూ ఈటల కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-07-03T21:24:55+05:30

తెలంగాణ బీజేపీలో (TS BJP) మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను (Bandi Sanjay) తొలగించిన ఆ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) నియమించింది.! మరోవైపు.. బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి అగ్రనాయకత్వం తీసుకుంటోంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ బీజేపీలో (TS BJP) మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను (Bandi Sanjay) తొలగించిన ఆ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) నియమించింది.! మరోవైపు.. బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి అగ్రనాయకత్వం తీసుకుంటోంది. ఈ ఇద్దరి పేర్లు దాదాపు ఖరారైపోగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ బీజేపీ పాలిటిక్స్ హస్తినాలో వాడీవేడీగా సాగుతున్నాయి. ఇవన్నీ ఒకఎత్తయితే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు (Raghunandan Rao) సంచలన వ్యాఖ్యలు చేస్తూ నానా రచ్చ చేస్తు్న్నారు. చేయాల్సిన కామెంట్స్ అన్నీ చేసేసి అబ్బే.. అదంతా తూచ్ అని కొట్టిపారేశారు. ఈ క్రమంలోనే బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) మెదక్ జిల్లాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాయంత్రం మెదక్‌ జిల్లాలో పర్యటించిన రాజేందర్‌కు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా కార్యకర్తలు నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

బీజేపీకి మాత్రమే..!

ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు చేతలకు పోలిక లేదు. తెలంగాణ యువకులు, విద్యార్థులు ఈ ముఖ్యమంత్రి మాకొద్దు అని అంటున్నారు. ఈసారి ఆరునూరైనా కేసీఆర్‌ను ఓడించి తీరుతాం. దెబ్బ కొడితే దిమ్మతిరగాలి. హుజురాబాద్‌లో (Huzurabad) ఎలాంటి తీర్పునిచ్చిందో తెలంగాణలో అలాంటి తీర్పు వస్తుంది. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్‌ను మట్టిలో కలిపేస్తారు. ఆ పార్టీతో జతకడితే వారి పనిపోయినట్లే. ఈ మూడేళ్లలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీనే గెలిచింది. దుబ్బాక, హుజురాబాద్‌లలో కాంగ్రెస్‌కు డిపాజిట్ పోయింది. బీఆర్ఎస్ పార్టీని, జిత్తుల మారి కేసీఆర్‌ను ఇంటికి పంపే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది. దేశంలో రైతులను ఆదుకునే సర్కార్ కేసీఆర్ సర్కార్ అని ఇతర రాష్ట్రాలతో మాట్లాడిండు. తెలంగాణలో రబీలో నోటీకాడి పంట వానలకు నేలపాలు ఆయింది. 10 వేలు ఇస్తానని ఐదు పైసలు కూడా ఇవ్వలేదు. పంజాబ్, మహారాష్ట్ర రైతులకు తెలంగాణ డబ్బులు ఇచ్చారు. తెలంగాణలో కౌలు రైతులు చనిపోతే రూ. 5 లక్షలు ఇచ్చే దమ్ముందా..?. బీజేపీ అధికారంలోకి వస్తే కౌలు రైతులు చనిపోతే రూ. 5 లక్షలు ఇస్తాం అని ఈటల హామీ ఇచ్చారు.

నిరుద్యోగుల్లారా రండి..!

సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి.. చేతలు గడప దాటలే. తెలంగాణ నిరుద్యోగుల్లారా కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. TSPSC లో ప్రభుత్వ పెద్దల అండదండలతో పేపర్లు లీకేజీ అయిందని విచారణలో తేలినా చర్యలు తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో 200 మందికి ఒకటి చొప్పున బెల్టుషాపు ఉంది. లిక్కర్ ద్వారా రూ. 45 వేల కోట్ల ఆదాయం వస్తుంది. సంక్షేమ పథకాలన్నీటికీ ఇస్తే రూ 25 వేల కోట్లు కావు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట దావత్‌లు చేసిండ్రు. సీఎం కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు ఆత్మగౌరవం సిద్ధంగా ఉంది. ప్రజా క్షేత్రంలో కేసీఆర్ అంతు చూస్తాం. కేసీఆర్ సర్కార్‌పై కొట్లాడటానికి అంకుటిత దీక్షతో బీజేపీ సిద్ధంగా ఉంది అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

కాగా.. రెండ్రోజుల కిందట వరకూ అంత యాక్టివ్‌గా లేని ఈటల రాజేందర్ కీలక పదవి వస్తుండటంతో స్పీడ్ పెంచారు. రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌ పదవిని కేంద్ర అధినాయకత్వం కట్టబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు ఈటలకు కూడా పదవి ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రకటన ఎప్పుడొస్తుందా అని తెలంగాణ బీజేపీ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Updated Date - 2023-07-03T21:28:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising