MLA: నాకు భద్రత అవసరం లేదు..
ABN , First Publish Date - 2023-12-08T10:16:09+05:30 IST
అంగరక్షకులు.. హడావిడి ఉండాలని ఎన్నికల్లో గెలవడాని చాలా మంది ఎమ్మెల్యేలు కోరుకుంటారు. కానీ, ఆయన తీరు మాత్రం

- అంగరక్షకులు వద్దన్న బండారి లక్ష్మారెడ్డి
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): అంగరక్షకులు.. హడావిడి ఉండాలని ఎన్నికల్లో గెలవడాని చాలా మంది ఎమ్మెల్యేలు కోరుకుంటారు. కానీ, ఆయన తీరు మాత్రం భిన్నం. ప్రజల్లో ఉండే నాకు ప్రత్యేకంగా భ్రదత అవసరం లేదని సెక్యురిటీని తిరస్కరించిన ఆయనే ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(Uppal MLA Bandari Lakshmareddy). ఇటీవలి ఎన్నికల్లో ఆయన 49 వేల పైచిలుకు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు టు ప్లస్ టు అంగరక్షకులను కల్పిస్తూ పోలీస్ శాఖ లేఖ పంపింది. ‘నాకు సెక్యురిటీ అవసరం లేదు’అని చెప్పిన ఆయన ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆయన నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.