Share News

Tax Distribution: పన్నుల వాటా తగ్గితే కేంద్రంపై పోరాటమే! కర్ణ్ణాటక సీఎం సిద్దరామయ్య

ABN , Publish Date - Mar 02 , 2025 | 05:54 AM

రాష్ట్రాలకు పన్నులవాటా 41శాతం నుంచి 40 శాతానికి తగ్గించేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి రాష్ట్రాలకు ఉండే రాజ్యాంగబద్ధమైన అధికారాలను తగ్గిస్తున్నారని, బలహీనం చేస్తున్నారని తెలుస్తోందన్నారు.

Tax Distribution: పన్నుల వాటా తగ్గితే కేంద్రంపై పోరాటమే! కర్ణ్ణాటక సీఎం సిద్దరామయ్య

బెంగళూరు, మార్చి 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా తగ్గిందని, ఈ అంశంలో కర్ణాటకకు అన్యాయం జరిగితే కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య స్పష్టంచేశారు. రాష్ట్రాలకు పన్నులవాటా 41శాతం నుంచి 40 శాతానికి తగ్గించేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి రాష్ట్రాలకు ఉండే రాజ్యాంగబద్ధమైన అధికారాలను తగ్గిస్తున్నారని, బలహీనం చేస్తున్నారని తెలుస్తోందన్నారు. రాష్ట్రాలకు వాటా పంపిణీ న్యాయబద్ధంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సెంట్రల్‌ ఫైనాన్స్‌ కమిషన్‌కు ఉందన్నారు. ఏటా కన్నడిగుల నుంచి రూ.4 లక్షల కోట్లు కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తోందని, రాష్ట్రానికి 15 పైసల వాటా మాత్రమే తిరిగి వస్తోందన్నారు. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ పన్నులు పంచే విషయంలో 4.713 శాతం నుంచి 3.64కు తగ్గించిందని వెల్లడించారు. తద్వారా కర్ణాటక గడిచిన ఐదేళ్లలో రూ.68,775 కోట్లు కోల్పోయిందని అన్నారు. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ వ్యవధి వచ్చే ఏడాది ముగుస్తుందని, ఇప్పటివరకు కమిషన్‌ సిఫారసు చేసిన స్పెషల్‌ గ్రాంటు రూ.5495 కోట్లు, రాష్ట్రానికి కేంద్రం వాటా రూ.6 వేల కోట్ల మొత్తం విడుదల కాలేదని తెలిపారు.


ఇవి కూడా చదవండి

Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్‌ అవినీతిపై పర్వేష్ వర్మ

Congress: కేరళ కాంగ్రెస్‌ నేతల భేటీకి థరూర్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2025 | 05:54 AM