TS News: మోదీ, అమిత్‌షాలు జైలుకు వెళ్లడం ఖాయం: గజ్జెల కాంతం
ABN, First Publish Date - 2023-04-09T19:09:51+05:30
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం (BJP Govt) ఓడిపోవడం ఖాయమని తెలంగాణ జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం (Gajjela Kantam) పేర్కొన్నారు.
హైదరాబాద్: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం (BJP Govt) ఓడిపోవడం ఖాయమని తెలంగాణ జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం (Gajjela Kantam) పేర్కొన్నారు. అనంతరం ఏర్పడిన కొత్త ప్రభుత్వం దేశ సంపదను గుజరాతీలకే కట్టబెడుతున్న విధానంపై విచారణ జరుగుతుందని.. ఈ విచారణ తర్వాత ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్‌మార్గ్‌లో ఏర్పాటు చేస్తున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ (Dr Ambedkar) 125 అడుగుల భారీ విగ్రహం వద్ద జరుగుతున్న పనులను గజ్జెల కాంతం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరును పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చొరవతో ఏర్పాటవుతున్న అంబేద్కర్ విగ్రహంతో తెలంగాణ ఆత్మగౌరవం పెరుగుతుందన్నారు. దేశాన్ని దోచుకుంటున్న వారిపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఎందుకు జరగడంలేదని ప్రశ్నించారు. దేశరాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై చర్చించేందుకు ఈ నెల 10 తేదీన గ్రాండ్ సితార హోటల్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించిన వారిలో జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకరి సురేందర్, బీసీ సంఘాల జేఏపీ చైర్మన్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్, ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు, సంచారజాతుల రాష్ట్ర అధ్యక్షులు కోలా శ్రీనివాస్ పూసలతో పాటు సంజీవ్‌నాయక్, రవీందర్ నాయక్, కొమ్ముల నరేందర్, రామకృష్ణ, వరయ్య, పీవై రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-09T19:12:56+05:30 IST