Gutta Sukhender Reddy: కాంగ్రెస్ విచిత్రంగా ప్రవర్తిస్తోంది
ABN, First Publish Date - 2023-07-04T09:54:52+05:30
ఖమ్మం సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై అధికార బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
నల్గొండ: ఖమ్మం సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై (Rahul Gandhi) అధికార బీఆర్‌ఎస్‌తో (BRS) పాటు బీజేపీ నేతలు (BJP Leaders) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ ప్రసంగంపై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Legislative Council Chairman Gutta Sukhender Reddy) మీడియాతో మాట్లాడుతూ... కర్ణాటక ఫలితాల తర్వాత దేశంలో, రాష్ట్రంలో అధికారం లేని కాంగ్రెస్ విచిత్రంగా ప్రవర్తిస్తోందని అన్నారు. దేశంలో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే కారణమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దింపాలనే దురాలోచనతోనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే అమలు అవుతున్నాయని తెలిపారు. తాము సమైఖ్యoగా ఉన్నామని చెబుతూనే క్రమశిక్షణ లేకుండా 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన భట్టిని ఖమ్మం సభలో పక్కకు నెట్టారని అన్నారు. బీజేపీని గద్దె దింపడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-07-04T09:54:52+05:30 IST