ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Motkupalli Narasimhulu: బీఆర్ఎస్‌కి బిగ్ షాక్... డీకే శివకుమార్‌తో మోత్కుపల్లి ఏం చర్చించారంటే..?

ABN, First Publish Date - 2023-09-29T16:53:53+05:30

జిల్లాలో బీఆర్ఎస్(BRS) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ కీలక నేత మోత్కుపల్లి నర్సింహులు(Motkupalli Narasimhulu) గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి త్వరలో కాంగ్రెస్‌ (CONGRESS)లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

నల్గొండ: జిల్లాలో బీఆర్ఎస్(BRS) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ కీలక నేత మోత్కుపల్లి నర్సింహులు(Motkupalli Narasimhulu) గత కొంతకాలంగా ఆ పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి త్వరలో కాంగ్రెస్‌(CONGRESS)లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే తన రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీనే సరైన వేదిక అని మోత్కుపల్లి భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. బెంగుళూరు కేంద్రంగా రాజకీయ మంతనాలు జరుపుతున్నారు. ఈ ప్లాన్‌లో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌(DK Sivakumar)తో మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం భేటీ అయ్యారు. దీంతో ఈ భేటీపై ప్రాధాన్యం సంతరించుకుంది. అక్టోబర్ మొదటి వారంలో మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. తుంగతుర్తి(Tungaturthi) నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలనే ఆలోచనలో మోత్కుపల్లి ఉన్నట్లు సమాచారం. ఇటీవల కొంతమంది కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కూడా తనను పార్టీలోకి ఆహ్వానించినట్లు విశ్వాసనీయ సమాచారం. దీంతో ఆయన త్వరలో కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఇటీవల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ ఎన్టీఆర్ ఘాట్‌లో మోత్కుపల్లి నర్సింహులు నిరహార దీక్ష కూడా చేశారు. ఆ సందర్భంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తనకు తమ్ముడు లాంటి వారని చెప్పిన విషయం తెలిసిందే.

కాగా.. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కూడా మోత్కుపల్లి దూరంగా ఉంటున్నారు. పలుమార్లు సీఎం కేసీఆర్‌(CM KCR)ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ అడిగిన.. ప్రగతి భవన్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. పార్టీలో చేరిన సమయంలో సీఎం కేసీఆర్ కీలక పదవి ఇస్తారని హామీ ఇచ్చినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీలో చేరిన కొత్తలో యాదగిరి నర్సన్న ఆలయానికి కేసీఆర్ వచ్చినప్పుడు ఆయన వెంట మోత్కుపల్లి తిరిగారు. ఆ తర్వాత కూడా కొన్ని కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ వెన్నంటి నడిచారు. ఆ తర్వాత ఏమయిందో కానీ గత కొంతకాలంగా కేసీఆర్... మోత్కుపల్లి నర్సింహులును దూరంగా పెడుతూ వస్తోన్నారు. దీంతో మోత్కుపల్లి బీఆర్ఎస్ అధిష్ఠానం, సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారం రోజుల క్రితం ఘాటైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-09-29T17:09:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising