Kavitha: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డ కవిత
ABN, First Publish Date - 2023-10-18T12:22:38+05:30
బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు అన్ని విధాలా అండగా సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. రైతు బంధు 16 వేలకు పెంచుతామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టూరిస్ట్ నాయకులని విమర్శించారు.
నిజామాబాద్: బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు అన్ని విధాలా అండగా సీఎం కేసీఆర్ (CM KCR) ఉన్నారన్నారు. రైతు బంధు 16 వేలకు పెంచుతామన్నారు. బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) నాయకులు టూరిస్ట్ నాయకులని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల వాతావరణం చెడగొట్టద్దని సూచించారు. నీటి సుంకం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. బీసీలకు పెద్దపీట వేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. బీఆర్‌ఎస్ అంటే బీసీల ప్రభుత్వమని స్పష్టం చేశారు. వేయి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది బీఆర్‌ఎస్ అని అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులను బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలా ఆదుకుందని ఎమ్మెల్సీ తెలిపారు.
సీఎంలు మార్చేటప్పుడు తగాదాలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో ప్రగతికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అమలు చేసిన పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ 65 ఏళ్లలో చేసింది ఏమిలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ ఎన్నికల గాంధీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఇక్కడ పర్యటించి ఎన్నికల వాతావరణం చెడగొట్టద్దన్నారు. రాష్ట్ర విభజన హామీలు రాహుల్ గాంధీ ఒక్కనాడైన పార్లమెంటులో అడిగారా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది బీఆర్‌ఎస్ అని అన్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బోధన్ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని అన్నారు. మరో మారు బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని కవిత ధీమా వ్యక్తం చేశారు.
Updated Date - 2023-10-18T12:22:38+05:30 IST