ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLC Kavitha: కాంగ్రెసోళ్ల మాటలు నమ్మొద్దు

ABN, First Publish Date - 2023-08-16T15:04:31+05:30

హైదరాబాద్‌లో ప్రతీ కులానికి ఆత్మగౌరవ భవనం కట్టామని తెలిపారు. అలాగే ప్రతీ మతానికి సంబంధించిన పండుగలు ఘనంగా చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ప్రతీ ఇంటికి పథకం వచ్చిందని చెప్పుకొచ్చారు. నిజామాబాద్‌లో ఐటీ హబ్ పెట్టి వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించుకున్నామని తెలిపారు.

నిజామాబాద్: బీఆర్ఎస్ అంటే ఇంటి పార్టీ అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బోధన్‌లో జరిగిన బహిరంగ సభలో కవిత (MLC Kavitha) మాట్లాడారు. తెలంగాణలో గులాబీ విప్లవం వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో ప్రతీ కులానికి ఆత్మగౌరవ భవనం కట్టామని తెలిపారు. అలాగే ప్రతీ మతానికి సంబంధించిన పండుగలు ఘనంగా చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ప్రతీ ఇంటికి పథకం వచ్చిందని చెప్పుకొచ్చారు. నిజామాబాద్‌లో ఐటీ హబ్ పెట్టి వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఇరిగేషన్ శాఖామంత్రిగా ఉన్న సుదర్శన్ రెడ్డి ఒక్క ప్రాజెక్టైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. ఆయనో వ్యాపారి అని.. కానీ షకీల్ మాత్రం ఓ సాధారణ కార్యకర్త అని వివరించారు. బోధన్‌లో సీనియారిటీకి, సిన్సియారిటీకి మధ్య పోటీ నెలకొందని పేర్కొన్నారు. గులాబీ కండువా కప్పుకున్నోళ్లు తిరగబడితే మీరెక్కడా తిరగలేరన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా? మూడు గంటలే ఇస్తామన్న కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) యాత్ర చేస్తే ఏం లాభం.. 60 ఏళ్లు ఏం చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని కవిత నిలదీశారు.

Updated Date - 2023-08-16T15:04:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising