KTR: కొడంగల్లో గెలవలేని రేవంత్ కామారెడ్డిలో గెలుస్తాడా?
ABN, First Publish Date - 2023-10-31T14:04:44+05:30
తొడలు కొట్టి భుజాలు ఎగిరేసిన వాళ్లు కేసీఆర్ వస్తుండడంతో ముఖం చాటేశారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మాచారెడ్డి మండల కేంద్రంలో రామారెడ్డి, మాచారెడ్డి మండలాల కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ మీద పోటీ చేసేందుకు భయపడుతున్నారన్నారు. కొడంగల్లో గెలవలేని రేవంత్ రెడ్డి కామారెడ్డిలో గెలుస్తాడా అని ప్రశ్నించారు.
కామారెడ్డి: తొడలు కొట్టి భుజాలు ఎగిరేసిన వాళ్లు కేసీఆర్ (CM KCR) వస్తుండడంతో ముఖం చాటేశారని మంత్రి కేటీఆర్ (Minister KTR) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మాచారెడ్డి మండల కేంద్రంలో రామారెడ్డి, మాచారెడ్డి మండలాల కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ మీద పోటీ చేసేందుకు భయపడుతున్నారన్నారు. కొడంగల్లో గెలవలేని రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) కామారెడ్డిలో గెలుస్తాడా అని ప్రశ్నించారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి డిపాజిట్ రాకుండా చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ (Congress) ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ వేడుకుంటున్నారని... కానీ 50 ఏళ్లలో రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీల పంచాయతీలు ఢిల్లీలో జరుగుతాయని... అలాంటి నాయకులు మనకు అవసరమా అని మంత్రి అన్నారు.
కేసీఆర్ లాంటి నాయకుడిని రాష్ట్ర ప్రజలు మన బిడ్డ అనుకుంటూ ఆదరిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కామారెడ్డిని ఎంచుకోవడం కామారెడ్డి నియోజకవర్గ ప్రజల అదృష్టమని చెప్పుకొచ్చారు. కామారెడ్డి నియోజకవర్గ ప్రజల దశలు మార్చేందుకు కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కోరిక మేరకే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని తెలిపారు. కామారెడ్డికి కేసీఆర్ వస్తుండడంతో ప్రతిపక్షాలు భూములు గుంజుకోవడానికి అని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి నిధులు ఇచ్చి ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
Updated Date - 2023-10-31T14:04:44+05:30 IST