కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Renuka chaudari: రేణుకాచౌదరి సంచలన కామెంట్స్.. రాష్ట్రాన్ని బాగుచేయలేనోడు దేశాన్ని ఉద్దరిస్తాడా?

ABN, First Publish Date - 2023-08-24T12:32:52+05:30

‘తెలంగాణ రాష్ట్రీయ సమితి’ అని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‏లో అసలు తెలంగాణ లేదని కేంద్రం మాజీ మంత్రి రేణుకాచౌదరి

Renuka chaudari: రేణుకాచౌదరి సంచలన కామెంట్స్.. రాష్ట్రాన్ని బాగుచేయలేనోడు దేశాన్ని ఉద్దరిస్తాడా?

- అన్నం పెట్టిన తల్లినే మోసం చేసిన ఘనుడు కొత్తగూడెం ప్రజాప్రతినిధి

- ఆయన కొడుకు దుర్మార్గానికి ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది

- అలాంటి వ్యక్తికే మళ్లీ బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వడం దారుణం

- ప్రజాచైతన్య సభలో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి

కొత్తగూడెం, (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ రాష్ట్రీయ సమితి’ అని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‏లో అసలు తెలంగాణ లేదని కేంద్రం మాజీ మంత్రి రేణుకాచౌదరి(Former Union Minister Renuka Chaudhary) విమర్శించారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించలేని కేసీఆర్‌ ‘బీఆర్‌ఎస్‌’ పేరుతో దేశాన్ని ఉద్దరిస్తానని బయలుదేరడం ఎందుకని ప్రశ్నించారు. భద్రాద్రి జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌లో బుధవారం నిర్వహించిన ప్రజాచైతన్య సభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ అభిమానులు తనపై చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిదన్నారు. కొత్తగూడెం(Kothagudem) నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్‌ టిక్కెట్‌పై ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధి అన్నం పెట్టిన తల్లిని మోసం చేసి అధికార పార్టీ పంచన చేరాడని మండిపడ్డారు. ఆయన పొందుతున్న ఫలాలు కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన భిక్షే అన్నారు. అలాంటి వ్యక్తికి బీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ టిక్కెట్‌ ఇవ్వడం దారుణమన్నారు. స్థానిక ప్రజాప్రతినిధి కుమారుడు చేసిన దుర్మార్గానికి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. ఇలాంటి వారి వద్దకు ప్రజలు న్యాయం కోసం ఎలా వెళ్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కేంద్రంలో బీజేపీలు ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, పెరుగుతున్న ధరలతోపాటు సంక్షేమ పథకాల అమలులో జాప్యమే ఇందుకు నిదర్శనమన్నారు.

కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.500కే వంటగ్యాస్ ను అందించి నిత్యావసర ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకుని రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తమవంతు సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ఎన్నికలు సమీపించాయని, ఈ ఎన్నికల్లో ఇతర పార్టీ నాయకులు నగదు చూపించి మోసం చేసే కుట్ర కుతంతాలకు బలికావద్దని సూచించారు. పీసీసీ జనరల్‌ సెక్రటరి ఎడవల్లి కృష్ణకు కొత్తగూడెం కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఇప్పించేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తొలుత రేణుకాచౌదరికి కొత్తగూడెం రైల్వేస్టేషన్‌ వద్ద భారీ గజమాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో పీసీసీ జనరల్‌ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ, జాతీయ ఓబీసీ కో ఆర్డినేటరు కత్తి వెంకటస్వామి, టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ తాటి వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు మానుకొండ రాధాకిషోర్‌, రామ్మూర్తినాయక్‌, ఎల్‌. సురేందర్‌, గురిజాల గోపీ, డాక్టర్‌ శంకర్‌నాయక్‌, జలీల్‌, రాయల శాంతయ్య, నాయకులు అంతోటి పాల్‌, మల్లిఖార్జున్‌, మతిన్‌, ఏలూరి రాజేష్‌, సకినాల వెంకటేశ్వర్లు, కొప్పుల రమేష్‌, స్టీవెన్‌ లాజరస్‌, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-24T12:59:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising