ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BRS Congress: తెలంగాణలో బీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తు ఫిక్స్ అయ్యిందా.. ఇక మిగిలింది అధికారిక ప్రకటనేనా.. ఆయన మాటలతో ఒక్కసారిగా..!?

ABN, First Publish Date - 2023-03-31T19:24:58+05:30

కొద్ది రోజులుగా రెండు పార్టీల నాయకత్వాల నుంచి వెలువడుతున్న సంకేతాలు పొత్తు కుదిరే దిశగా ఆశలు చిగురింపచేస్తున్నాయి.

Coalition between in BRS and Congress in Telangana
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: తెలంగాణ(Telangana)లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీఆర్ఎస్(BRS) పార్టీ ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగే క్రమంలో పార్టీని విస్తరిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోనూ సభలు, సమావేశాలు పెడుతోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR) వివిధ రాజకీయ పార్టీల అధినేతలతో సమావేశమౌతున్నారు. కేంద్రంలో అధికార బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ఆయన తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, జేడియూ అధినేత నితీశ్ కుమార్ యాదవ్, ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులను కలుసుకున్నారు. దక్షిణాదిలో డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, జేడీఎస్ అధినేత కుమారస్వామి, వామపక్షాల నేతలను కూడా కలుసుకుని చర్చలు జరిపారు. ఇంతకాలం కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల నేతలతో కలిశారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమిగా ఉంటామనే సంకేతాలిచ్చారు.

అదానీ అంశంపై విపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. పార్లమెంట్ లోపల, బయట కూడా ఉమ్మడి పోరాటం చేస్తున్నాయి. దీంతో పాటు రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడటంతో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల్లో ఐక్యత మరింత పెరిగింది. కాంగ్రెస్ కూడా విపక్షాలతో కలిసి పోరాటాలు చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ దోస్తీకి నెమ్మదిగా సంకేతాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా బిల్లుపై ఢిల్లీలో ఆందోళన చేసిన సమయంలో యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి సెల్యూట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కూడా సానుకూల సంకేతాలు వెలువడ్డాయి.

మరోవైపు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ అధికార బీఆర్ఎస్‌పై ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) బీఆర్ఎస్ నాయకత్వ వైఫల్యాలను ఎండగడ్తున్నారు. ఇదే తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి (Congress leader Jana Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని (BJP) ఎదుర్కునేందుకు అన్ని పార్టీలతో కలసి పనిచేస్తామన్నారు. మోదీ పాలనపై ప్రజలు గొంతు విప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలన్నారు. బీజేపీపై పోరుకు, ఎన్నికలకు సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ (BRS) పార్టీతో కాంగ్రెస్ పొత్తు అనేది.. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని జానారెడ్డి చెప్పారు.

జానారెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని కొట్టిపారేయలేం. అలా అని ఆయన కూడా చెప్పుకోలేదు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందా లేదా అనేది ఇప్పటికిప్పుడే ఒక నిర్ధారణకు రాలేం. కానీ కొద్ది రోజులుగా రెండు పార్టీల నాయకత్వాల నుంచి వెలువడుతున్న సంకేతాలు పొత్తు కుదిరే దిశగా ఆశలు చిగురింపచేస్తున్నాయి. అదే జరిగితే తెలంగాణలో కొత్త రాజకీయాలు మొదలౌతాయి. బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరితే రెండు పార్టీలకు మేలు చేయడమే కాక బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చెక్ పెట్టడానికి అవకాశం కుదురుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పొత్తు కుదరకపోయినా తర్వాతైనా అవసరాన్ని బట్టి రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరేందుకు తాజా పరిణామాలు తోడ్పడనున్నాయి. అయితే సొంత బలంతో అధికారంలోకి రావాలని రెండు పార్టీలూ యత్నిస్తున్నాయి. ఈ తరుణంలో బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య పొత్తు వల్ల లాభనష్టాలను అంచనా వేసుకుని రెండు పార్టీల అధినాయకత్వాలు ముందుకెళ్లే అవకాశం ఉంది. నిజానికి ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి దారులు మూసేసేందుకు రెండు పార్టీలకు అవకాశం కుదురుతుంది.

మరోవైపు 2019లో బీజేపీ తెలంగాణ నుంచి 4 ఎంపీ సీట్లు సాధించి సత్తా చాటుకుంది. 2024లో మరిన్ని ఎక్కువ ఎంపీ సీట్లు సాధించాలని కమలనాథులు లక్ష్యం పెట్టుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరితే బీజేపీకి కష్టకాలమే అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ కనుక మోదీ నాయకత్వం దేశానికి మరికొంత కాలం అవసరమనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు నచ్చచెప్పడంలో సక్సెస్ అయితే ఎన్నికల్లో కమలనాథుల పంట పండేందుకు కూడా అవకాశం ఉంటుందని పరిశీలకుల అంచనా. బీజేపీ నాయకత్వం ఇప్పటికే బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందుంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి.

Updated Date - 2023-03-31T19:42:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising