TS New Secretariat : కొత్త సచివాలయంలో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే...!

ABN , First Publish Date - 2023-06-07T12:24:25+05:30 IST

అవును.. తెలంగాణ కొత్త సచివాలయంలో (TS New Secretariat) దొంగలు పడ్డారు. అంత పెద్ద సెక్రటేరియట్‌కు సెక్యూరిటీ గట్టిగానే ఉంటుంది కదా దొంగలు ఎలా వచ్చారబ్బా అని ఆశ్చర్యపోతున్నారా..?

TS New Secretariat : కొత్త సచివాలయంలో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే...!

అవును.. తెలంగాణ కొత్త సచివాలయంలో (TS New Secretariat) దొంగలు పడ్డారు. అంత పెద్ద సెక్రటేరియట్‌కు సెక్యూరిటీ గట్టిగానే ఉంటుంది కదా దొంగలు ఎలా వచ్చారబ్బా అని ఆశ్చర్యపోతున్నారా..? అవునండోయ్.. అంత సెక్యూరిటీని దాటే దొంగలొచ్చారు.. ఈ తతంగం అంతా ఒకటి రెండ్రోజులుగా జరుగుతున్నది కాదు.. వారం, పదిరోజులుగా ఇదే తంతట. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాధికారులు ఎందుకు అలర్ట్ కావట్లేదు..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకీ దొంగలు ఏం ఎత్తుకెళ్లారు..? సచివాలయంలో ఏ బ్లాక్‌లో దొంగతనం జరిగింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..!

TS--New-Secratariat.jpg

అసలేం జరిగిందంటే..?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొత్త సెక్రటేరియట్‌ నిర్మించింది కానీ.. దొంగలు పడకుండా ఆపలేకపోయింది..!. సచివాలయం పక్కన మీడియా సెంటర్‌లో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. వర్క్ నడుస్తున్నంత సేపు అక్కడ సిబ్బంది ఉంటున్నారు కానీ.. ఆ తర్వాత ఎవరూ ఆ ప్రదేశంలో అడ్రస్ కనిపించరు. దీన్నే అదనుగా చేసుకున్న దొంగలు ఈ ప్రదేశంలోకి చొరబడ్డారు. ఒకరా ఇద్దరు కాదు ఏకంగా ఐదారుగురు మీడియా సెంటర్‌లోకి వచ్చి దొరికినవన్నీ ఎత్తుకెళ్లారు. ఇలా జరగడం ఇవాళేం కొత్తేం కాదట. నిత్యం ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే.. మీడియాకు తెలియకుండా అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటి వరకూ వేల రూపాయిలు విలువ చేసే కరెంటు వైర్లు, రాడ్లు, స్విచ్ బోర్డులు, ఎల్ఈడీ లైట్లు ఎత్తుకెళ్లారు. నిన్న ఒక్కరోజే పదివేలకు పైగా విలువ చేసే సామాగ్రి అపహరణకు గురికావడం గమనార్హం. అయితే ఇదొక్క చోటే కాదు.. కొత్తగా నిర్మిస్తున్న అమరవీరుల స్మృతి చిహ్నం వద్ద కూడా ఇదే పరిస్థితి. అయితే ఇక్కడ ఏం ఎత్తుకెళ్లారో అనే విషయం అధికారులు బయటికి పొక్కనీయట్లేదు.

Stolen.jpg

రూ. 600 కోట్ల పైచిలుకు ఖర్చు పెట్టిన ప్రభుత్వం సరైన నిఘా లేకపోవడంతోనే ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం అలర్ట్ అయితే సరే.. లేకపోతే మీడియా సెంటర్, స్మృతి చిహ్నం వద్ద జరిగిన పరిస్థితే మంత్రులు చాంబర్లలో జరిగినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..!

Stolen-2.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************

KCR Vs Congress : సీఎం కేసీఆర్ వింత వైఖరి.. ఆలోచనలో పడిన బీఆర్ఎస్ నేతలు.. సడన్‌గా ఇలా యూటర్న్ తీసుకున్నారేంటో..?

******************************
Ambati Rayudu : ‘అంబటి’ అడుగులు ఎటువైపు.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ కేక్‌గా మారిన రాయుడు.. వైసీపీ తరఫున ఎంపీగా పోటీచేస్తారన్న వార్తల్లో నిజమెంత..?

******************************

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణామం.. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైన ఆప్.. కవితలో పెరిగిన టెన్షన్..?

******************************

Telangana Politics : తెలంగాణ ఎన్నికల్లో త్రిముఖ పోరా.. ద్విముఖ పోరా..? బీజేపీని కేసీఆర్ పక్కనెట్టారా.. సరెండర్ అయ్యారా.. అసలేం జరుగుతోంది..!

******************************

Updated Date - 2023-06-07T12:25:25+05:30 IST