Corona: తెలంగాణలో దడ పుట్టిస్తున్న కరోనా కేసులు
ABN, Publish Date - Dec 22 , 2023 | 10:11 PM
కరోనా ( Corona) పీడ వదిలింది అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ పంజా విసురుతుంది. గతవారం రోజుల నుంచి కోవిడ్-19 కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉండడంతో ప్రజలు భయాందళనలకు గురవుతున్నారు. కరోనా వ్యాప్తి క్రమంగా తెలంగాణ జిల్లాలో క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో ఈ రోజు మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 27 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు ఈ రోజు విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపారు.
హైదరాబాద్: కరోనా ( Corona) పీడ వదిలింది అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ పంజా విసురుతుంది. గతవారం రోజుల నుంచి కొవిడ్-19 కేసుల పెరుగుదల ఆందోళనకరంగా ఉండడంతో ప్రజలు భయాందళనలకు గురవుతున్నారు. కరోనా వ్యాప్తి క్రమంగా తెలంగాణ జిల్లాలో పెరుగుతోంది. తెలంగాణలో ఈ రోజు మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 27 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు ఈ రోజు విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపారు. కరోనా తాజా పరిస్థితికి అనుగుణంగా రాష్ట్ర యంత్రాంగం అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
కాగా.... ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు భయాందోళనలో కొట్టు మిట్డాడుతున్నారు. జాగ్రత్తలు పాటించకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. పూణే వైరాలజీ రిపోర్ట్ ఆధారంగా ఎంజీఎం సూపరింటెండెంట్ తెలిపారు. ఆరు శాంపిల్స్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తెలినట్లు చెప్పారు. ఇద్దరిని జీనోమ్ టెస్టుకు వైద్యులు ఇచ్చారు. జీనోమ్ రిపోర్ట్ ఆధారంగా వారికి కరోనా కొత్త వేరియంట్ ఉందా లేదా అన్నది వైద్యులు నిర్థారించనున్నారు. ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎంజీఎంలో అన్ని ఏర్పాట్లు చేశాం, ఎలాంటి ఆందోళన చెందవద్దని సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు.
Updated Date - Dec 22 , 2023 | 10:20 PM