మహిళలు ఆర్థికంగా బలపడాలి
ABN , First Publish Date - 2023-04-11T23:59:12+05:30 IST
లాభదాయకమైన యూనిట్లను నెలకొల్పి మహిళలు ఆర్థికంగా బలపడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ అన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన మహిళా సంఘాల అవ గాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పీఎంఎ్‌ఫఎంఈ ద్వారా వివిధ రంగాలకు చెందిన చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు, అందుకు అవసరమైన శిక్షణ, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

అదనపు కలెక్టర్ దీపక్ తివారీ
భువనగిరి అర్బన్, ఏప్రిల్11: లాభదాయకమైన యూనిట్లను నెలకొల్పి మహిళలు ఆర్థికంగా బలపడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ అన్నారు. కలెక్టరేట్‌లో జరిగిన మహిళా సంఘాల అవ గాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పీఎంఎ్‌ఫఎంఈ ద్వారా వివిధ రంగాలకు చెందిన చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు, అందుకు అవసరమైన శిక్షణ, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రతీ మహిళ తనకు ఆసక్తి ఉన్నరంగాల్లో ముందుకు సాగాలన్నారు. తమ ఆరోగ్యంపై మహిళలు ప్రత్యేకశ్రద్ధ తీసుకొని మరింత అభివృద్ధిలో రాణించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో మందడి ఉపేందర్‌రెడ్డి, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు అధికారులు సుమంత్ రాంపాల్, మంజునాథ్, రామకృష్ణ, జిల్లా ఎల్‌ఎండీ నాగరాజు, డీపీఎం ఏ. సునీల్‌రెడ్డి, ఏపీఎంలు పాల్గొన్నారు.