Kotamreddy: జగన్, సజ్జలపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-02-18T21:14:18+05:30
షాడో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కేసులు పెట్టి అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్, కోర్టుకు తీసుకెళ్లకుండా..
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) , ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) పై నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు. షాడో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలను జిల్లా పోలీసులు పాటిస్తున్నారని ఆరోపించారు. తన అనుచరులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని పనులు మానేసి నెల్లూరు రూరల్ పనుల్లో ఉన్నారని మండిపడ్డారు. పోలీసులపై తనకు ఎలాంటి కోపం లేదని, పోలీసు యంత్రాంగాన్ని తాను తప్పుపట్టడం లేదని, స్వయంగా షాడో సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలు ఇస్తే పోలీసులు పని చేయకతప్పదని, ఆ విధంగా చేయనప్పుడు వాళ్లు ఇబ్బందులు పడతారన్నారు. అమరావతిలో కూర్చోని షాడో మఖ్యమంత్రిగా వ్యవహారిస్తూ, సజ్జల రామకృష్ణారెడ్డి తన వెంట నడిచే కార్యకర్తలు, నాయకులను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చిల్లర చేష్టాలు చేస్తే మీకు మిగిలేది ఏమీ ఉండదని హెచ్చరించారు.
షాడో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కేసులు పెట్టి అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్, కోర్టుకు తీసుకెళ్లకుండా పోలీసులు జీపుల్లో ఎక్కించి ఎక్కడ తిప్పుతారో తిప్పుకో అని సవాల్ కోటంరెడ్డి చేశారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదని, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఓ శాసనసభ్యుడిగా పోరాటం చేస్తునే ఉంటానని స్పష్టం చేశారు. తన వెంట నడిచే నాయకులు, కార్యకర్తలను ఇలాంటి వేధింపులతో భయపెట్టాలనుకుంటే జగన్, సజ్జల తరం, నీ తండ్రి, తాత తరం కాదని కోటంరెడ్డి హెచ్చరించారు.
నగర వైసీపీ అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావుతో పాటు రఘు, జావేద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. అరెస్ట్‌లపై పోలీసులు సరైన సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. తాను వేదాయపాలెం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అక్కడ వెంకటేశ్వర రావు లేకపోవడంతో పోలీసులను నిలదీశానన్నారు. 24 గంటల్లో న్యాయస్థానంలో ప్రవేశపెడతామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో నిరసన విరమించినట్లు ఆయన చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
******************************
ఏపీ విభజనపై ఉండవల్లి చెప్పిన షాకింగ్ నిజాలు
*****************************************
దొంగ సార దందాలో కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదు
****************************************
Updated Date - 2023-02-18T22:30:25+05:30 IST