ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh: ఆ పోలీసులను క్షమించేది లేదు : సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Aug 30 , 2024 | 08:58 PM

ముంబై నటి వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. అప్పటి పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపిందన్నారు. తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

CM Chandrababu Naidu

అమరావతి, ఆగష్టు 30: ముంబై నటి వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. అప్పటి పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపిందన్నారు. తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శుక్రవారం నాడు మీడియాతో చిట్ చాట్‌‌‌లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. మహిళలు, ఆడబిడ్డల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.


గుడ్లవల్లేరు కళాశాలలో జరిగిన ప్రచారం పట్ల అంతా భయాందోళనలకు గురయ్యారని సీఎం చెప్పారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. అందరి సమక్షంలోనే ఇప్పటి వరకూ హాస్టల్ మొత్తం చేసిన తనిఖీ చేపట్టామని.. ఈ తనిఖీల్లో ఎలాంటి పరికరాలు లభించలేదన్నారు. అయినా దర్యాప్తు ఆపబోమని.. సమగ్ర విచారణ కొనసాగుతుందని సీఎం తెలిపారు. కొన్ని ప్రచారాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా, ధైర్యంగా ఉండాలన్నారు. తప్పు చేసిన ఎవరినీ తమ ప్రభుత్వం ఉపేక్షించదన్నారు.


పార్టీలో చేర్చుకుంటారా?

వైసీపీని వీడుతున్న వారి విషయంలో సీఎం చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీలో ఇమడలేక చాలా మంది తమవైపు వస్తామంటున్నారని చెప్పారు. అయితే, అందరినీ కాకుండా.. మంచి వ్యక్తిత్వం ఉన్న వారినే చూసి తీసుకుంటామన్నారు. పార్టీకి, నేతలకు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండానే చేరికలు ఉంటాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. వైసీపీకి రాష్ట్రంలో ఇక భవిష్యత్ లేదని భావిస్తున్న ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసి వేరే పార్టీల్లో చేరిపోతున్నారు. ఈ క్రమంలో చాలా మంది టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు.


Also Read:

కిడ్నాపర్‌‌ను వదిలిరానని బాలుడి ఏడుపు..

గూగుల్ పే నుంచి కొత్తగా ఆరు ఫీచర్లు.. అవేంటంటే..

బలవంతంగా ఇంట్లోకి వెళ్లాలని చూసిన దొంగ.. ఆ వెంటనే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 30 , 2024 | 08:58 PM

Advertising
Advertising