ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: నామినేటెడ్ పదవుల భర్తీ.. ఎంతమందికి అంటే

ABN, Publish Date - Sep 24 , 2024 | 01:12 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు పెద్ద పీట వేస్తుంది. ఈ నేపథ్యంలో 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్ట్‌ను కూటమి ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.

CM Chandrababu Naidu

అమరావతి, సెప్టెంబర్ 24: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు పెద్ద పీట వేసింది. 99 మందితో తొలి నామినేటెడ్ పదవుల జాబితాను మంగళవారం ప్రకటించింది. అందులో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్ద పీట వేసింది. 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్‌లకు పదవులు కేటాయించింది.

Also Read: Tirumala Laddu: పుణ్య క్షేత్రాల్లోని లడ్డూలకు పరీక్షలు


ఒక క్లస్టర్ ఇంఛార్జీను చైర్మన్ పదవిలో నియమించింది. అలాగే ఆరుగురు యూనిట్ ఇంఛార్జ్‌లకు పదవులు కేటాయించింది. 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, ఒక కార్పొరేషన్‌కు వైస్ చైర్మన్‌తోపాటు వివిధ కార్పొరేషన్లకు సభ్యులను సైతం కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన నామినేటేడ్ పోస్టుల్లో 99 శాతం పదవులు యువతకే ప్రాధాన్యత ఇచ్చింది. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ పదవులు కేటాయించారు.

Also Read: Tirupati Laddu: ప్రముఖ నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు


గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకోలేక పోయిన వారికి.. అలాగే పొత్తుల్లో భాగంగా టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆ క్రమంలో టీడీపీ -16, జనసేన -3, బీజేపీ -1 చొప్పున మొత్తం 20 నామినేటెడ్ పోస్టుల భర్తీ చేశారు.

Also Read: R k Roja:ఇజ్జత్ పాయె.. రోజాకు దిమ్మతిరిగే పంచ్


కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..

  • వక్ఫ్ బోర్డు: అబ్దుల్ అజీజ్

  • స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP): అనిమిని రవినాయుడు

  • AP హౌసింగ్ బోర్డ్: బత్తుల తాత్యబాబు

  • AP షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం (AP TRICAR): బొరగం శ్రీనివాసులు

  • AP మారిటైమ్ బోర్డ్: దామచర్ల సత్య

  • APలో ఉపాధి కల్పన & ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ కోసం సొసైటీ (SEEDAP): దీపక్ రెడ్డి

  • 20 పాయింట్ ఫార్ములా: లంకా దినకర్ (బీజేపీ)

  • AP మార్క్‌ఫెడ్: కర్రోతు బంగార్రాజు

  • AP స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్: మన్నె సుబ్బారెడ్డి

  • ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ APIIC : మంతెన రామరాజు

    Also Read: Tirupati Laddu: తిరుమల లడ్డూ వ్యవహారం.. సిట్ అధిపతి ఎవరంటే..


  • AP పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ: నందం అబద్దయ్య

  • AP టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్: నూకసాని బాలాజీ

  • APSRTC చైర్మన్, APSRTC వైస్ చైర్మన్: కొనకళ్ల నారాయణ, పిఎస్‌ మునిరత్నం

  • AP అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: పీలా గోవింద సత్యనారాయణ

  • లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్: పిల్లి మాణిక్యాల రావు

  • AP రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి: పీతల సుజాత

  • A.P. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMSME DC): తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన)

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్: తోట మెహర్‌ సుధీర్‌ ( జనసేన)

  • ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APTPC): వజ్జా బాబురావు

  • AP టౌన్‌షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ APTIDCO: వేములపాటి అజయ్‌కుమార్‌ (జనసేన)

    Also Read: Geneva: వేలానికి గోల్కొండ వజ్రాలతో పొదిగిన నెక్లెస్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 24 , 2024 | 01:56 PM