ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళలను అడ్డుకున్న రోప్‌ పార్టీ, A rope party that prevented women

ABN, Publish Date - Sep 01 , 2024 | 10:59 PM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై అభిమానంతో సుదూర ప్రాంతాల నుంచి కలవడానికి వచ్చిన మహిళలపై రోప్‌ పార్టీ పోలీసులు దాష్టీకం చూపించారు. సుదూర ప్రాంతాల నుంచి జగన్‌ను కలిసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానులపై ఇలా పోలీసులు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

జగన్‌ను కలిసేందుకు వెళుతున్న వారిని అడ్డుకుంటున్న రోప్‌ పార్టీ

బయటి జిల్లాల అభిమానులకు చుక్కెదురు

పులివెందుల టౌన్‌, సెప్టెంబరు 1: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై అభిమానంతో సుదూర ప్రాంతాల నుంచి కలవడానికి వచ్చిన మహిళలపై రోప్‌ పార్టీ పోలీసులు దాష్టీకం చూపించారు. సుదూర ప్రాంతాల నుంచి జగన్‌ను కలిసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానులపై ఇలా పోలీసులు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ సీఎం వైఎ్‌సజగన్‌ వైఎ్‌సఆర్‌ కడప జిల్లా మూడురోజుల పర్యటనలో భాగంగా రెండోరోజు పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ను కలవడానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అయితే వారిపై రోప్‌ పార్టీ పోలీసు సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. జగనన్నను కలిసేందుకు వచ్చిన తమపై చొక్కాలు పట్టి లాగడం, మహిళలు అని చూడకుండా చేతులు వేసి నెట్టడం దారుణమని వాపోతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని కలిసేందుకు చిత్తూరు జిల్లా బంగారుపాలెం నుంచి పెద్దఎత్తున మహిళలు తరలివచ్చారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు వచ్చిన మాపై ఇలా ప్రవర్తించడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ వారు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు.

Updated Date - Sep 01 , 2024 | 10:59 PM

Advertising
Advertising