వీరభద్ర స్వామికి వెండి కిరీటం
ABN, Publish Date - Oct 02 , 2024 | 12:06 AM
శ్రీశైలం క్షేత్రంలోని వీరభద్రస్వామికి మంగళ వారం శ్రీశైలం కొత్త పేటకు చెందిన డి.పుల్లయ్య వీరభద్ర స్వామికి వెండికిరీటం, వెండిపళ్లెం సమర్పిం చారు.
శ్రీశైలం, అక్టోబరు 1: శ్రీశైలం క్షేత్రంలోని వీరభద్రస్వామికి మంగళ వారం శ్రీశైలం కొత్త పేటకు చెందిన డి.పుల్లయ్య వీరభద్ర స్వామికి వెండికిరీటం, వెండిపళ్లెం సమర్పిం చారు. ఆకుపచ్చ రాయితో కూడిన వెండికిరీటం బరువు 800 గ్రాములు, వెండి పళ్లెం 290 గ్రాముల బరువు ఉంటుందని దాత తెలిపారు. ఈ విరాళాన్ని దాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు ఉమానాగేశ్వరశాస్త్రి, పర్యవేక్షకులు అయ్యన్నకు అందజేశారు. దేవస్థానం అధికారులు దాతకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసి సత్కరించారు.
అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు హైదరాబాద్‌కు చెందిన విజయగోపాల్, రేఖారాణి పట్టువస్త్రాలను సమర్పించారు. మొత్తం 53 పట్టుచీరలు, 10 పంచెలను దాత అంందజేవారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాత వీటిని ప్రధాన అర్చకులు మార్కండేయశాస్త్రి, ప్రజాసంబంధాల అధికారి శ్రీనివాసరావుకు అందజే శారు. దేవస్థానం అధికారులు దాతకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసి సత్కరించారు.
Updated Date - Oct 02 , 2024 | 12:06 AM