AP : ఘనంగా ఆత్మీయ సమావేశం
ABN, Publish Date - Dec 08 , 2024 | 01:05 AM
విద్యార్థులు తమ ఉజ్వల్ భవిష్యత కోసం బాగా చదువు కోవాలని జిల్లా గ్రంథాల యాల సంస్థ మాజీ చైర్మన గౌస్‌మోద్దీన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్, టీచర్స్ కార్యక్రమాన్ని మండలంలోని అన్ని పాఠశాలల్లో పండుగలా నిర్వ హించారు. కల్లూరు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్ర మానికి జిల్లా గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు.
గార్లదిన్నె, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు తమ ఉజ్వల్ భవిష్యత కోసం బాగా చదువు కోవాలని జిల్లా గ్రంథాల యాల సంస్థ మాజీ చైర్మన గౌస్‌మోద్దీన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్, టీచర్స్ కార్యక్రమాన్ని మండలంలోని అన్ని పాఠశాలల్లో పండుగలా నిర్వ హించారు. కల్లూరు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్ర మానికి జిల్లా గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. ఎంఈఓ తారా చంద్రానాయక్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శారదాబాయి, సతీష్, పాఠశా ల కమిటి చైర్మ్‌న ఎర్రిస్వామి, వడ్లరాము, సామాల మధు, సుధా కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు కులశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం రూరల్: మండలపరిధిలోని పాపంపేట పాఠశాలలో శనివారం నిర్వహించిన తల్లిదండ్రులు- ఉపాధ్యా యుల సమావేశానికి మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్ ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు ఆట-పాటల పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. టీడీపీ నాయకులు రామాంజినేయులు, బాబావలి. గోవిందు, సాంబశివ తదితరులు పాల్గొన్నారు. అలాగే కురుగుంటలోని అంబేడ్కర్ గురుకుల కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగురైతు నియోజకవర్గం అధ్యక్షుడు నారాయణస్వామి, కళాశాల కమిటీ చైర్మన తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.
చెన్నేకొత్తపల్లి: తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలను శనివారం మండలంలోని అన్నిప్రభుత్వ పాఠశాల ల్లో పండుగలా నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపా ధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. చెన్నేకొత్తపల్లిలోని ఉన్నత పాఠశాలలో ఎస్‌ఐ సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
నార్పల: మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. బీ పప్పూరు పాఠశాలలో హెచఎం రాధాశ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉపాధ్యా యులు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. బాలుర పాఠశాలలో టీడీపీ నాయకులు ఆకుల బాబు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులకు పలు ఆటల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. నార్పల సర్పంచు సుప్రియ, జడ్పీటీసీ నాగరత్నమ్మ, ప్రిన్సిపాల్ సంగీతకుమారి మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శింగనమల: మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశా లను నిర్వహించారు. విద్యార్థులకు అటల పాటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. శింగనమల జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో మండల ప్రత్యేకాధికారి మహమ్మద్ బషీర్ ఇస్లాం, తహసీల్థార్ సాకే బ్రహ్మయ్య, ఎంపీడీఓ నిర్మల కుమారి, సీఐ కౌలుట్లయ్య, ఎంఈఓ నరసింహరాజు, విద్యాకమిటీ చైర్మన బోయ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కనగానపల్లి: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం మెగా పేరెంట్స్ వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి. పిల్లలు, తల్లితండ్రులకు పలు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎంఈఓ అరుణమ్మ, టీడీపీ నాయకులు నెట్టెం వెంకటేష్, యాతం పోతలయ్య, అంకే రామక్రిష్ణ, బట్టా సురేష్‌చౌదరి, నాగబూషణం, చల్లా సోము తదితరలు పాల్గొన్నారు.
ఆత్మకూరు: మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లితండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పలు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈకార్య క్రమంలో టీడీపీ మండల టీడీపీ కన్వీనర్ శ్రీనివాసులు, తహసీల్దార్ లక్ష్మీనాయక్, ఎంపీడిఓ లక్ష్మీనరసింహ, నాయకులు శశాంక చౌదరి, పాళశాల కమిటి చైర్మన బొమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Dec 08 , 2024 | 01:05 AM